ఈ సారి బాల‌య్య‌ను గ‌ట్టిగా టార్గెట్ చేసిన జ‌గ‌న్‌.. హిందూపురంలో ప్లానింగ్ చూశారా ?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ , హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర‌స్ప‌ర యుద్ధం జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ టీడీపీలో ఎంద‌రో అగ్ర నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో అయితే ఎంతో మందిని జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓడించేశారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు త‌న‌యుడు అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను సైతం మంగ‌ళ‌గిరిలో ఎన్నో ప‌థ‌కాలు.. ర‌క‌ర‌కాల వ్యూహాలు వేసి ఓడించారు. ఇక దేవినేని ఉమాతో పాటు త‌న‌ను అసెంబ్లీలో టార్గెట్ చేసే ఎంద‌రో నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌పై ర‌క‌ర‌కాల వ్యూహాలు వేసి మ‌రీ జ‌గ‌న్ వాళ్ల‌ను ఓడించేశారు.

చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం కుప్పంలో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 30 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక ఎన్నికల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక కూడా టీడీపీలో బ‌ల‌మైన నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు టార్గెట్ చేస్తూ వాళ్ల పునాదుల‌ను నేల‌మ‌ట్టం చేసేశారు. చివ‌ర‌కు కుప్పంలోనే మున్సిపాల్టీ తో పాటు మండ‌లాలు.. జ‌డ్పీటీసీలు చివ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పునాదులు.. కూసాలు క‌దిలి పోయాయి.

ఎవ‌రిని ఎలా క‌దిపినా కూడా బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో జ‌గ‌న్ ఎప్పుడూ కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేదు. అయితే ఈ సారి ఎలాగైనా బాల‌య్య కోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి బాగా ఫోక‌స్ పెట్టి మ‌రీ ప‌ని చేస్తున్నారు. అందుకే పుంగ‌నూరు ఆడ‌ప‌డుచు బీసీ మ‌హిళ అయిన పిల్లి దీపిక‌కు సీటు ఇచ్చారు. ఆమె భ‌ర్త ది రెడ్డి సామాజిక వ‌ర్గం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ప్ర‌చారం ఇత‌ర బాధ్య‌త‌లు చూసిన జ‌గ‌న్ ఈ నెల 4న నేరుగా హిందూపురం వ‌స్తున్నారు. అక్క‌డ దీపిక‌ను గెలిపించాల‌ని స‌భ పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎలాంటి స్పీచ్ ఇస్తారు ?  బాల‌య్య‌పై విమ‌ర్శ‌లు చేస్తారా ? బాలయ్య మీద ఇప్పటిదాకా ఒక్క మాట అనని జగన్ ఈసారి నోరు విప్పుతారా ఆయన మీద ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నదానిపై అంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. అయితే హిందూపురంలో గ్రూపుల గోల అయితే మామూలుగా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: