ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు.. ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందంటే?

praveen
దాదాపు గత నెల రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సీజన్ ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని టీమ్స్ కూడా 10 మ్యాచ్లను పూర్తిచేసుకున్నాయ్. మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. దీంతో ఈసారి ప్లే ఆఫ్ లో ఏ జట్టు చోటు సంపాదించుకుంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ విషయంపై అటు క్రికెట్ ప్రేక్షకుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది

 కొన్ని టీమ్స్ తర్వాత ఆడబోయే మ్యాచ్లలో గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ లో చేరడం మాత్రం కష్టమే అన్న విషయం అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్లలో ఎనిమిదింటీలో విజయం సాధించి 16 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత స్థానంలో కోల్కతా, లక్నో, సన్రైజర్స్ జట్లు కొనసాగుతూ ఉండడం గమనార్హం.  అయితే రానున్న రోజుల్లో ప్రతి జట్టు మరో నాలుగు మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో ఇక ఏ టీమ్ వరుస విజయాలు సాధిస్తూ పాయింట్లు పట్టికలో పైకి దూసుకు వస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడానికి ఏ జట్టుకు ఎంతల అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. రాజస్థాన్ జట్టుకు 95% ప్లే ఆఫ్ లో అడుగుపెట్టి ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే కోల్కతాకు 85% అవకాశాలు ఉన్నాయట. ఆ తర్వాత లక్నోకి 60 శాతం, హైదరాబాద్ జట్టుకి 55 శాతం, చెన్నైకి 38%, ఢిల్లీకి 30%, గుజరాత్ టైటాన్స్ కి 17%, పంజాబ్ కి 17%, ముంబై ఇండియన్స్ కి రెండు శాతం, బెంగళూరు జట్టుకి కేవలం ఒక్క శాతం మాత్రమే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేందుకు అవకాశం ఉన్నట్లు క్రిక్ ట్రాకర్ అభిప్రాయ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: