చంద్రబాబు:3 సెంట్ల స్థలం ఇచ్చేనా.. సాధ్యమయ్యేనా..?
అందులో ఎన్ని కంప్లీట్ అయ్యాయి అనే విషయానికి వస్తే తొమ్మిది లక్షల ఇల్లు పూర్తి అయ్యాయి. మిగతా చోట్ల ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వపు ఆదేశం.. సెంటు అనేది పట్టణాలలో ఒకటిన్నర సెంటు గ్రామాలలో అనేది.. పట్టణ ప్రాంతాలలో 2,80,000.. పల్లెలలో ప్రాంతాలలో 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది డబ్బులు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నది ఏమిటంటే.. గతంలో ఒక సెంటు అంటే సమాధి కట్టుకోవడానికి చాలదంటూ మాట్లాడారు.
సెంటు అంటే 48 గజాలు.. 480 చదరపు అడుగులు.. చంద్రబాబు ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్లలో 480 చదరపు అడుగుల అన్న ఇల్లు అసలు లేదు.. అన్నీ కూడా 350 , 370 చదరపు అడుగుల రేంజ్ లో ఉన్నాయి. అక్కడ సెంటు కంటే చాలా తక్కువకే ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ తప్పు పట్టడం జరిగింది. చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు తీసుకున్న వారికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం కూడా ఇస్తారా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారుతోంది. లేదా ఇవి రద్దు చేసి మళ్ళీ ఇస్తారా.. ఇలా ఇవ్వాలంటే మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించాలి. కన్స్ట్రక్షన్ జరిగిన వాటిని పడేస్తారా.. మరి ఆల్రెడీ కట్టిన ఇళ్లను రెండిళ్లను కలిపి ఒకటి చేస్తారా.. ఒకళ్ళకి ఇస్తే .. అలా సగం మందికి వెళ్లిపోతాయి.. మిగిలిన వారికి వేరొక చోట లే అవుట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో అయితే ఏకంగా ముగ్గురిది కలిపేయాల్సి ఉంటుంది.. మిగిలిన వారికి మిగతా చోట ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా.. ఇది ఎలా సాధ్యమూ..?
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పైన చెప్పిన విధంగానే డబ్బుని ఇస్తుంది.. మిగతా డబ్బునంత రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే జగనన్న కాలనీ అనే పేరుతో ఎన్నో కాలనీలు కూడా రూపొందించారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ఒకటి, ఒకటిన్నర సెంటుకి మాత్రమే ఇంత ఖర్చు.. చంద్రబాబు ఇస్తానన్న మూడు సెంట్లు ఖర్చులకు లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.