ఏపీ : షర్మిల ట్రాప్ లో వైసీపీ.. విమర్శలు చేస్తే నిండా మునిగినట్లేనా?

Reddy P Rajasekhar
ఏపీలో ఎన్నికలకు మరో 36 రోజుల సమయం మాత్రమే ఉంది. సరిగ్గా ఎన్నికల సమయంలో సునీత, షర్మిల జగన్ పై, అవినాష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. షర్మిల విమర్శలపై వైసీపీ నేతలు ధీటుగా స్పందిస్తున్నామని భావిస్తున్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం షర్మిల ట్రాప్ లో వైసీపీ పడిందని వైసీపీ నేతలు షర్మిల, సునీతలను టార్గెట్ చేస్తే ఆ పార్టీకే తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ నేతలు షర్మిల విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ చేసిన విమర్శలను సైతం షర్మిల తెలివిగా ప్రచారం చేసుకుంటున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే మాపై సోషల్ మీడియాలలో దుష్ప్రచారం చేయడం న్యాయమా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. నేను వైఎస్సార్ బిడ్డనే కాదనే విధంగా కామెంట్లు చేయడం సిగ్గుచేటని షర్మిల పేర్కొన్నారు. కడప నగరంలో నిర్వహించిన సభల్లో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
 
షర్మిలపై విమర్శలు చేస్తే మాత్రం వైసీపీ నిండా మునిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా షర్మిల, సునీత అడుగులు పడుతున్నాయి. షర్మిల, సునీత కామెంట్ల వల్ల వైసీపీకి కొంతమేర నష్టం తప్పదని చెప్పవచ్చు. షర్మిల, సునీత వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే షర్మిల జగన్, అవినాష్ లను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
 
అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి చివరి వరకు కృషి చేశారని వివేకా రెండో వివాహంతోనే ఆ కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. తండ్రి హత్యదారులు, కుట్రదారులతో సునీత దంపతులు సఖ్యతగా ఉన్నారని బాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.. వివేకా హత్యకు ఆస్తి వివాదాలే కారణమని వైసీపీ వెల్లడిస్తుండగా రాబోయే రోజుల్లో వివేకా కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: