బూమరాంగ్‌: జగన్‌ చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టిన చంద్రబాబు?

Chakravarthi Kalyan
ఏపీలో పింఛన్ల రగడ నడుస్తోంది. ప్రతి నెల ఒకటో తారీఖు అందాల్సిన పింఛన్.. ఈ నెల ఆ తేదికీ అందలేదు. అందుకు మీరంటే మీరే కారణం అంటూ వైసీపీ, టీడీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ అభ్యతరం చెప్పడం వల్లే పింఛన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని వైసీపీ చెబుతోంది. గత ఐదేళ్లుగా ఇంటి వద్దనే పింఛన్ అందుకున్న వృద్ధులు, వికలాంగులు వైసీపీ ప్రచారాన్ని నమ్ముతున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

వాస్తవానికి ఈ నెల మూడు నుంచి వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు  చేసింది. ప్రతి నెల ఒకటో తేదీనే వీటిని ఇస్తుండగా.. ఆర్బీఐ సెలవులు, ఆర్థిక సంవత్సరం ముగింపు, ఇలా ఇతరత్రా కారణాల వల్ల ఈ నెల పింఛన్ల పంపిణీ మూడుకు వాయిదా పడింది. ఇదే సమయంలో టీడీపీ సానుభూతి పరులు వాలంటీర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించే కార్యక్రమం నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది.

వెంటనే స్పందించిన ఎన్నికల సంఘం పింఛన్ల పంపినీ నుంచి వీరిని దూరం చేసింది. అయితే అప్పటి నుంచి ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించవద్దని టీడీపీ ఫిర్యాదు వల్లే ఈ నెల పింఛన్లు ఆగిపోయాయని వైసీపీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దీనిపై ఫిర్యాదు చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.

ఈ అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా అవకాశంగా మలుచుకొంది. పింఛన్ రాని వృద్ధుల వద్దకు వెళ్లి పింఛన్ రాకపోవడానికి చంద్రబాబే కారణం అని చెప్పిస్తున్నారు. మరికొందరు టీడీపీ వల్లే తమ పింఛన్లు ఆగిపోయాయని భావిస్తున్నారు. ఇలాంటి వీడియో బైట్లు తీసి సోషల్ మీడియా వేదికగా టీడీపీ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ పన్నిన వ్యూహంలో తెలుగు తమ్ముళ్లు బుక్ అయ్యారని తెలుస్తోంది. మరి ఇది ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: