అది చిన్నాన్న చివరి కోరిక.. అందుకే ఇలా చేస్తున్నా : షర్మిల

praveen
ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల వ్యవహారం సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అన్న జగన్ ను సీఎం కూర్చి నుంచి దూరం చేయాలని పావులు కదుపుతుంది. ఒకరకంగా చెప్పాలంటే టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ పొత్తు ఉన్నట్లుగానే ప్రస్తుతం షర్మిల తీరు ఉంది. ఎందుకంటే గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను ఎక్కడ  తెరమీదకి తీసుకురాకుండా.. కేవలం జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది షర్మిల.

 ఇలా  కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న షర్మిల  ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒక పెద్ద బాంబు పేల్చింది ఈమె. ఏకంగా కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. అక్కడ అధికార వైసిపి పార్టీ నుంచి షర్మిల అన్నయ్య వైయస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.  ఆయనపై షర్మిల ప్రత్యర్థిగా బరిలోకి దిగపోతుంది. ఇలా షర్మిల కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తూ ఉండడం జగన్ పార్టీకి మైనస్ కానుంది. ఎందుకంటే షర్మిల వైసిపి ఓట్లను చీల్చితే ఏకంగా టిడిపి కూటమి లాభపడే అవకాశం ఉంది.

 ఇకపోతే ఒక కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల.. ప్రత్యేకంగా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. సాక్షాదారాలు ఉన్న వివేక హంతకులు నేటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. చిన్నాన్నను దారుణంగా చంపితే గుండెపోటుతో చనిపోయారని సాక్షులు చూపించారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్ రెడ్డికే జగన్ టికెట్ ఇచ్చారు. నేను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న వివేక చివరి కోరిక.. అందుకే ఆయనను కక్షగట్టి చంపేశారు. వైసీపీ నిందితులకు టికెట్ ఇచ్చింది. అందుకే నేను కడప నుంచి పోటీకి దిగుతున్నాను అంటూ షర్మిల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: