రాయలసీమ: కూటమికి సపోర్టుగా స్టార్ హీరోయిన్.. ప్రచారం..!

Divya
రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం లో కూటమి అభ్యర్థిగా బిజెపి నేత సత్యకుమార్ అక్కడ పోటీ చేస్తున్నారు.. అటు వైయస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి నిలబడుతున్నారు. గత ఐదేళ్ల నుంచి ఈయన ప్రజలతోనే మమేకమవుతూ ఉన్నారు.. ఇక్కడ ఈయనకు పేరు కూడా బాగుంది.గతంలో టిడిపి ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నప్పటికీ.. ఆయనకి టికెట్ ఇస్తారనుకున్నారు కానీ అనూహ్యంగా కూటమి నుంచి సత్య కుమార్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. మధ్యలో విభేదాలు వచ్చిన..అటు టిడిపి నేతలు బిజెపి నేతలు జనసేన నేతలు కూడా ముకుమ్మడిగా ప్రచారం చేస్తూ ఉన్నారు.

ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చేలా సినీనటి బిజెపి మహిళా నేత నమిత కూడా ఎన్నికలలో ప్రచారంగా పాల్గొనింది.. ముందుగా ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి ఆలయంలో నమిత దంపతులు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి అనంతరం ధర్మవరం పట్టణంలోని రోడ్డు షోలో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి బిజెపి, టిడిపి,జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమిత బిజెపి కార్యవర్గ సభ్యురాలుగా కూడా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఈమె లోక్సభ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

ఇప్పుడు ధర్మవరం నుంచి కూటమి తరపున బిజెపి నేత సత్యకుమార్ పోటీ చేయడంతో ఈ రోజున ముదిగుబ్బ మండలంలో గుడ్డంపల్లి తాండ ,ముక్తాపురం తదితర గ్రామాలలో సత్యకుమార్ తో ఈమె పర్యటించబోతున్నారు.అక్కడ నియోజవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ప్రజలను సుఖసంతోషాలతో ఉండేలా బాధ్యతలు తీసుకుంటానంటూ కూడా తెలియజేస్తున్నారు సత్య కుమార్. నిత్యం ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని కూడా వెల్లడిస్తున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన పనులను కూడా చేస్తానంటూ హామీ ఇస్తున్నారు సత్యకుమార్. అయితే ఇక్కడ మాత్రం కేతిరెడ్డికి మంచి ఆదరణ ఉన్నది.. మరి ఇలాంటి సమయంలో సినీ గ్లామర్ ని తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నప్పటికీ ఎంతవరకు ఇది కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: