"కుబేర" నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరోగా నటిస్తూ ఉండగా , రశ్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రూపొందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ధనుష్ కు సంబంధించిన ఫాస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించిందిఎం ఇకపోతే నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి నాగార్జున కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది.
 


ఈ చిత్ర బృందం నాగార్జున కు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఓ గొడుగు పట్టుకుని స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇకపోతే వీడియోను గమనించినట్లు అయితే ఇందులో నాగార్జున ఉన్న ప్రదేశంలో చాలా మొత్తంలో ఓ వ్యాన్ లో డబ్బుల కట్టలు ఉన్నాయి. అక్కడి నుండి నాగార్జున కు సంబంధించిన ఈ వీడియోను చూపించారు. దీని ప్రకారం నాగార్జున కు ఆ డబ్బుతో ఏదో సంబంధం ఉండడం , దాని వల్ల ఎవరి లైఫ్ లో తిరగబడడం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున , ధనుష్ , శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ఇటు తెలుగు , అటు తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: