జగన్ : చంద్రబాబు డర్టీ గేమ్ లో షర్మిల పాత్ర అదే ..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు  జరగనున్నాయి. అయితే ఇప్పటికే వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని చివరి దశలో ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ అధికార పార్టీ అయిన వైసీపీ ప్రతి పక్ష పార్టీగా ఉన్న టిడిపి ప్రస్తుతం కూటమిగా ఏర్పరచుకొని వారి వారి మేనిఫెస్టో లతో ప్రచార జోరును చూపిస్తున్నాయి. వివిధ పార్టీ నేతలు ఇప్పటికే ఇంటింట ప్రచారాన్ని కొనసాగించే పనిలో ఉన్నాయి.ఎన్నికలు సమీ పిస్తున్న వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా రోడ్ షోలలో పర్యటించనున్నారు అయితే దాంట్లో భాగంగా ఇటీ వల టైమ్స్ నౌ న్యూ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని అంశాలపై ప్రస్తావించారు. దాంట్లో ముఖ్యంగా తమ సంక్షేమ పథకాల గురించి తను గడిపిన జైలు జీవితం గురించి ముఖ్యం గా తన సోదరి షర్మిల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వైసీపీ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ అని జాతీయస్థాయిలో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదని కూడా అన్నారు. రాష్ట్ర బాగుకోరుకు నేటటువంటి పార్టీ ఏదైనా జాతీయ స్థాయిలో ఉంటే దానికి తమ మద్దతు ఇస్తామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ అయిన రాహులైన ఎవరికైనా సరే వ్యక్తిగతంగా తన పూర్తి మద్దతు మాత్రం లేదని చెప్పారు. వైయస్ షర్మిల ప్రస్తావన వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా బాధపడుతూ చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డర్టీ గేమ్ లో తన సోదరి షర్మిలను ఒక పావులాగా వాడుకుంటున్నారని అన్నారు. షర్మిలను ఎంతలా ప్రభావితం చేశాడంటే నేనంటే తన అన్నయ్యని అన్న సంగతి మర్చిపోయే లాగా ప్రభావితం చేశారు.చంద్ర బాబు నాయుడు యొక్క కపటం మోసం బుద్ధి షర్మిలకు ముందు ముందు రోజుల్లో తెలుస్తాయని కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: