సీటు మారినా హోం మంత్రి వ‌నిత పేటు మారేనా ?

RAMAKRISHNA S.S.
ఏపీ హోం మంత్రి తానేటి వ‌నిత‌కు ఈ సారి గెలుపు క‌ష్టంగానే క‌నిపిస్తోంది. వ‌నిత పార్టీలు మార‌డంతో పాటు ప్ర‌తి ఎన్నిక‌కు నియోజ‌క‌వ‌ర్గాలు మారుతూ రావ‌డం స్థానికంగా ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జ‌నాలు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రిని నెత్త‌మీద పెట్టుకుని గెలిపించారంటే వారు త‌మ‌ను గెలిపించిన సీటు వ‌దుల‌కుని మ‌రో చోట‌కు వెళ్లి.. మ‌ళ్లీ తిరిగి అక్క‌డ‌కు వ‌స్తే స‌హించ‌లేరు. టీడీపీ నుంచి 2009లో గోపాల‌పురం ఎమ్మెల్యేగా గెలిచిన తానేటి వ‌నిత‌.. ఆ త‌ర్వాత వైసీపీలోకి  వెళ్లి 2014, 2019 ఎన్నిక‌ల్లో అక్క‌డ పోటీ చేశారు.

2019లో గెలిచాక ఆమె మంత్రి అయ్యారు. ప్ర‌స్తుతం హోం మంత్రిగా ఉన్నారు. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె కావాల్సినంత వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. ప‌లు స‌ర్వేల‌తో పాటు జ‌గ‌న్ సొంత స‌ర్వేల్లోనూ కొవ్వూరులో వ‌నిత‌కు సీటు చిత్తు చిత్తుగా ఓడిపోతుంద‌ని తేల‌డంతో ఆమెను గ‌తంలో పోటీ చేసిన గోపాల‌పురంకు మార్చి.. ఇక్క‌డ ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావును కొవ్వూరుకు మార్చారు.

వ‌నిత సీటు మార్చినా ఎన్నిక‌ల్లో ఆమె ఫేటు మాత్రం మారే ఛాన్సులు అస్స‌లు లేవు. మొన్న నామినేష‌న్ల టైంలోనే టీడీపీ క్యాండెట్ మ‌ద్దిపాటి వెంక‌ట్రాజు నామినేష‌న్ హోరెత్తిపోయింది. ఆ నామినేష‌న్‌కు వ‌చ్చిన వారిని బీట్ చేయాల‌ని వ‌నిత ప్ర‌తి పంచాయ‌తీకి ధ‌న‌, మ‌ద్య ప్ర‌వాహాలు ఏరులై పారించినా అనుకున్న స్థాయిలో జ‌నాలు రాక వైసీపీ వాళ్లే డిజ‌ప్పాయింట్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నాయ‌కుల్లో చాలా మంది ఆమె వెన‌క రావ‌డం లేదు.

ఇక జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన దేవ‌ర‌ప‌ల్లి మండ‌లానికి చెందిన రాష్ట్ర స్థాయి నేత జీవీ తో వ‌నిత అంటీముట్ట‌న‌ట్టుగా ఉంటోంద‌ని.. జీవీకి ప్ర‌యార్టీ ఇస్తే త‌న‌కు రేపు ఎక్క‌డ ఏకుమేకు అవుతాడో.. అస‌లే జ‌గ‌న్‌తో బాగా స‌న్నిహితంగా ఉంటాడ‌న్న టెన్ష‌న్ వ‌నిత‌కు ఉందంటున్నారు. జీవీ కూడా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండ‌డంతో పాటు దేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలో కాస్తో కూస్తో ప‌ట్టున్న నేతే. అలాంటి నేత‌లే ఇప్పుడు వ‌నిత గెలుపుకోసం పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని టాక్ ?

ఇక ఇటు టీడీపీ నుంచి వెంక‌ట్రాజు జోరు మామూలుగా లేదు. యేడాదిన్న‌ర నుంచి నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిగా గ్రిప్ తెచ్చుకుని ప్ర‌తి గ్రామంలోకి.. ప్ర‌తి వ‌ర్గంలోకి చొచ్చుకుపోయాడు. రెండు నెల‌ల క్రితం వ‌చ్చిన వ‌నిత నియోజ‌క‌వ‌ర్గం చుట్టే లేపోలే ఎన్నిక‌ల టైం వ‌చ్చేసింది. పైగా టీడీపీలో బ‌ల‌మైన వ‌ర్గాలు చేతులు క‌లిపి భారీ మెజార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఏదేమైనా వ‌నిత సీటు మారినా ఆమె ఫేటు మార‌డం అయితే క‌ష్టంగానే క‌నిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: