వైసీపీ Vs టీడీపీ ఒకే క్యాస్ట్‌.. ఒకే ఏజ్‌... ఒకే కాన్‌స్టెన్సీలో పోటీ... ఇద్ద‌రిలో పార్లమెంటు గ‌డ‌ప తొక్కేదెవ‌రో..!

RAMAKRISHNA S.S.
కొన్ని దశాబ్దాల పాటు ప్రధాన పార్టీల నుంచి సీనియర్లే పోటీపడిన ఏలూరు పార్లమెంటు వేదికగా ఈసారి ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు యువ నేతలు ... అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ ప‌డుతున్నారు. ఇక పార్లమెంటు పరిధిపరంగా చూస్తే ఇద్దరు నాన్ లోకల్ అయినా వ్యక్తుల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అధికార వైసీపీ నుంచి తణుకు చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు యువకుడు అయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుంటే ... టిడిపి నుంచి స్థానికులను కాదని చంద్రబాబు సైతం అదే బీసీ అస్త్రం వాడారు.

పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు అయిన కడప జిల్లా మైదుకూరు కు చెందిన పుట్ట సుధాకర్ యాదవ్ ను పోటీలోకి దింపుతున్నారు. ఇద్దరూ కూడా కాస్త అటు ఇటుగా ఒకే వయసుకు చెందినవారు. ఇద్దరు బీసీలలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నేతలు కావడం విశేషం. ఇద్దరి నేతలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరికీ వ్యక్తిగతమైన బలాలు అంటూ ఏమీ లేవు. పూర్తిగా పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న తమ తమ పార్టీల అభ్యర్థుల మీద ఆధారపడుతున్నారు. ఇద్దరు పార్లమెంటు పరిధికి నాన్ లోకల్ కిందే వస్తారు.

ఉన్నంత‌లో సునీల్ నే కాస్త లోక‌ల్ అనుకోవాలి. ఇద్దరికీ తమ తండ్రుల రాజకీయ వారసత్వమే ప్రధాన బలం కానుంది. గతంలో కారుమూరి ఏలూరుకి సమీపంలో ఉన్న ద్వారకా తిరుమల మండలం నుంచి జడ్పిటిసిగా గెలవడంతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో దెందులూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు విస్తృతంగా తన సామాజిక వర్గ సంఘాలతో ఉన్న పరిచయాలు ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇక టిడిపి అభ్యర్థి మహేష్ యాదవ్ రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో.. ఇటు పార్టీ క్యాడర్లోను.. స్థానికంగానూ కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం.

అయితే పార్టీ ఎంపిక చేసిన వ్యక్తి కావటం అటు మామ‌ యనమల రామకృష్ణుడు సీనియర్ కావడంతో పాటు ఆయనకు స్థానికంగా ఉన్న టిడిపి నాయకులతో ఉన్న విస్తృతమైన సంబంధాల నేపథ్యంలో అందరూ సహకరిస్తున్నారు. మరి ఈ ఇద్దరు యువనేతలలో ఎవరు ? ఏలూరు పార్లమెంటుపై గెలిచి తమ పార్టీ జెండా ఎగరేసి తొలిసారి పార్లమెంటులోకి అడుగు పెడతారో జూన్ 4న తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: