ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఈసి సంచలన ప్రకటన?

Purushottham Vinay
దేశంలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థులపై ఒక కొలిక్కి వచ్చిన ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బాగా బిజిగా ఉన్నాయి. ప్రస్తుతం ఏ వైపు చూసినా ఇలాంటి సందడే కనిపిస్తుంది.ఇక ఈ సమయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ సంచలన ప్రకటన చేసింది. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయంటే... ఆ రాజకీయ పార్టీలతో పాటు సర్వే సంస్థల సందడి కూడా చాలా బలంగా ఉంటుంది. పైగా ఈ మధ్య ఆ సందడి బాగా పెరిగిందని కూడా అంటున్నారు. ఇక ఇందులో భాగంగా.. ఇప్పటికే పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో కూడా సర్వేల సందడి మొదలైంది.ఈ టైంలో పలు ఏజెన్సీలు నిర్వహించే సర్వే ఫలితాలు... తర్వాత రాబోయే నిజమైన ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటుండగా.. మరికొన్ని మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. దీంతో... వీరికి అంచనా వేయడం రాలేదా.. లేక, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని సర్వేల పేరుతో జనాలపై రుద్దే ప్రయత్నం చేశారా అనే డౌట్ కూడా రాకమానదు. అయితే ఈ సమయంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సంగతి కాసేపు పక్కనపెడితే... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.


ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేశారు అని తెలుసుకుని.. వాటి ఆధారంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమిపాలవుతారు ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది వంటి విషయాలను వెల్లడిస్తుంటారు. వీటిని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అని అంటారు.ఇవి పోలింగ్ అయిన రోజు రాత్రే వస్తాయి.అయితే... ఒక దశలోనే జరిగిపోయే ఎన్నికల విషయంలో సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సారి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ సమయంలో ఒక దశ ఎన్నికలు అవ్వగానే దాని ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తే... వాటి ప్రభావం మిగతా దశల్లో జరిగే ఎన్నికలపై పడే ఛాన్స్ ఉంది.అందువల్ల ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఏడు దశల్లో కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ అంశం తెరపైకి రావాలి తప్ప ఈలోపు రాకూడదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 దాకా ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకూడదంటూ ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: