ఏపీలో కాంగ్రెస్ పోటీపై స‌రికొత్త ట్విస్ట్ ఇది..!

RAMAKRISHNA S.S.
ఏపీలో తిరిగి పుంజుకోవాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంటి?  ఎన్ని స్థానాల్లో పోటీకి రెడీ అవుతోం ది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాలు వు్న్నాయి. అయితే.. కాంగ్రె స్ పార్టీ ప్ర‌ధానంగా సీమ‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ఇక్క‌డ వైసీపీకి బ‌లంగా మారిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమ‌వైపు తిప్పుకోవాలనేది పార్టీ వ్యూహం. అందుకే ప్ర‌ధానంగా అనంత‌పురంలోనే ఏఐసీసీ అధ్య‌క్షుడితోనూ స‌మావేశం నిర్వ‌హించారు.
అయితే.. కేవ‌లం సీమపైనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేయా లనేది కాంగ్రెస్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ బ‌రిలో నిలుస్తున్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌లీల్‌ఖాన్ ను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక్క‌డ ఈయ‌న‌ను నిల‌ప‌డం ద్వారా ఖ‌చ్చితం గా గెలుపుగుర్రం ఎక్కొచ్చ‌నేది పార్టీ వ్యూహంగా ఉంది.
అదేవిధంగా వైసీపీలో టికెట్లు రాని వారు ఒక‌రిద్ద‌రు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఖ‌చ్చితంగా సీటు రానుంది. ఉదాహ‌ర‌ణ‌కు.. గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారాయ‌ణ‌స్వామి.. టికెట్‌ను ఆయ‌న మేన‌ల్లుడు డి. ర‌మేశ్‌బాబు ఆశించారు. ఈయ‌న కూడా వైసీపీ నాయ‌కుడే. అయితే.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ముందు ఇస్తామ‌ని.. ప‌నిచేయాల‌ని చెప్ప‌డంతో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చివ‌ర‌కు నారాయ‌ణ స్వామి కుమార్తె కృపాల‌క్ష్మికి కేటాయించారు.
దీంతో ర‌మేశ్‌బాబు.. కాంగ్రెస్ చెంత‌కు చేరారు. ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, పామ‌ర్రులో డీవై దాసు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారు. తిరువూరులో ర‌క్ష‌ణ నిధితో మంత‌నాలు జ‌రుగు తున్నాయి. ఇక్క‌డ కూడా ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగ ప‌డిన నాయ‌కులను కూడా కాంగ్రెస్ పార్టీ చేరువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
అయితే.. వారు ఎంత మేర‌కు వెల్తార‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే పార్టీలోచేరినా అధికారంలోకి వ‌చ్చేస్థాయి అయితే లేదు. దీంతో కొంద‌రు వెనుక‌డుగు వేస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 60-70 అసెంబ్లీ స్థానాలు, 5-10 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: