పవన్ నీడ నాదెండ్ల మనోహర్ ఏమైపోయారు..!!

Divya
పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా కూడా కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వైయస్ జగన్ ను తొక్కేస్తానంటూ పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తులకు చిత్తు అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో చాలామంది కార్యకర్తలు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టిపోస్తున్నారు. జనసేన ను నడిపించడంలోనే కాదు రాజకీయాలలో కొనసాగించడం కూడా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. ముఖ్యంగా తన సొంత సోదరుడు నాగబాబుకు కూడా సీటు లేకుండా చేశారు పవన్ కళ్యాణ్.
చివరకు పిఠాపురం నుంచి తాను పోటీ చేయబోతున్నారని వెల్లడించారు. అయినా టిడిపి నేతనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు.. ముఖ్యంగా బీజేపీ కూటమిలో తీసుకురావడం వల్ల తాను చాలా నష్టపోయానని కూడా ఇటీవలే వెల్లడించారు. బిజెపితో తనకు పొత్తు అవసరం లేదని చంద్రబాబు వ్యవహరించినప్పటికీ బిజెపిని పవన్ కళ్యాణ్ కూటమిలోకి తీసుకురావడం జరిగింది. కేవలం ఇదంతా తన భుజాన వేసుకొని పెద్దలతో మరి పొత్తులను ఒప్పించారు పవన్ కళ్యాణ్. దీంతో ఒక్కసారిగా తన బలం తగ్గిపోయిందని వెల్లడించారు.

అయితే హుందాతనం  ఆయన రాజకీయాలలో ఎక్కడ కనిపించలేదని తెలుస్తోంది. కూటమి వల్ల తన పార్టీలకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు నీడలా ఉండేటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు తనకు కేటాయించిన తెనాలి సీట్లను గెలవడానికి కుస్తీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్  కూడా లేరు.. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ ఐదుగురు జనసేన అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. ఇందులో మనోహర్ కూడా ఉండడం జరిగింది. జనసేన పార్టీలో నెంబర్-2 గా ఉన్న ఈయన తన వెంట ఇప్పుడు  నడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి టిడిపి నుంచి వచ్చిన నాయకులకు ఆయనే సీట్ల కేటాయించారు. సీట్ల పంపకాల విషయం అయిపోయిన తర్వాత నాదెండ్ల మనోహర్ పవన్తో ఎక్కడ కనిపించలేదు.. మరి రాబోయే రోజుల్లోనైనా పవన్ కళ్యాణ్ పెంట నాదెండ్ల మనోహర్ ఉంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: