పోలవరం: టార్గెట్ అప్పుడే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజున పోలవరం పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా అక్కడ ప్రాజెక్టు పనులకు సంబంధించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తెలంగాణలో ఏడు మండలాలు ఏపీలో విలీనం అవ్వడం చేత అప్పుడు పోలవరం పనులు చేశానని చంద్రబాబు తాజాగా వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో పోలవరం పనులు చాలా నెమ్మదిగా కదిలాయని ఈ ప్రాజెక్టు వల్ల కోస్తాంధ్ర జిల్లాలకు చాలానే నీరు లభిస్తుందని కూడా తెలియజేశారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు అని ఎక్కువ నీరు కూడా ఈ ప్రాజెక్టులో నిలువ ఉంటుందంటూ వెల్లడించారు.

2014, 19 లో పోలవరం ప్రాజెక్టు 70 శాతం వరకు పూర్తి చేశామంటూ వెల్లడించారు.గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఈ ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుందంటూ వెల్లడించారు. మళ్లీ మొత్తం డయా ఫ్రామ్ వాల్ నిర్మించాలి అంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నాలుగు చోట్ల డ్యామేజ్ అయ్యిందంటూ వెల్లడించారు. కాపర్ డ్యామ్ కింద ఇసుక దాదాపు 20 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. 150 మీటర్ల లోతు మేరకు ఇసుక వేసి ఫిల్ చేయవలసి ఉంటుంది అంటూ వెల్లడించారు చంద్రబాబు.

ఈ కాపర్ డ్యామ్ పనులకు దాదాపుగా 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల మరో నాలుగు ఏళ్ల పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం ఉందని లేకపోతే 2020కే పూర్తి అయ్యేది అంటూ తెలియజేశారు చంద్రబాబు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండాల్సిన వ్యక్తి కాదు అంటూ జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పనులు మొదలుపెట్టారు అన్ని ఏజెన్సీలను కూడా మార్చేశారు. ఆరోజు ప్రశ్నించే పరిస్థితి లేదని కూడా వెల్లడించారు ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత మాదే ఫస్ట్ రివ్యూ చేసాము ఇంకా పరిశీలించిన తర్వాత పనులు మొదలు పెడతామంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: