సోమవారం పోలవరం: ఇన్నిసార్లు ఎందుకు ఆగిందంటే.?

Pandrala Sravanthi
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రాజెక్టుల పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది పోలవరం ప్రాజెక్ట్. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎలా మిగిలిపోతుందో  పోలవరం ప్రాజెక్టు కూడా ఆ విధంగానే ఆ విధంగానే ఆగిపోతూ వస్తోంది. అలాంటి పోలవరం ప్రాజెక్టును దీన్ని 1941 ఆనాటి  నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యారు, దీనికి ప్రతిపాదనలు చేశారు.  ఆ టైంలో దీని పేరు రామపాద సాగర్ అని పెట్టారు. అప్పుడు 129 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు  నిర్మాణానికి నోచుకోలేదు. 1953లో మరోసారి గోదావరి జలాలు విపరీతంగా వచ్చాయి.. చాలా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరు అవసరం వచ్చింది ఈ సమయంలో కూడా ప్రాజెక్టు మళ్ళీ కట్టాలనుకున్నారు.

 కానీ అప్పుడు కూడా కార్యాచరణ దాల్చలేదు. ఇక 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలు  వచ్చాయి. 1981 లో నాటి సీఎం  అంజయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1985, 86 లో దీని వ్యయం 2665 కోట్లు అంచనా వేశారు. అయినా ముందడుగు పడలేదు. ఆ తర్వాత 1989లో  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక 1994లో  చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువగా ఐటివైపు దృష్టి పెట్టి, ప్రాజెక్టును మరిచిపోయారు. ఆ తర్వాత 2004లో కాస్త కదలిక వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించి  కాస్త ముందుకు తీసుకెళ్లారు. అన్ని అనుమతులు వచ్చారు, చివరికి 2009లో అనుకోకుండా వైయస్సార్ ప్రమాదంలో మరణించారు. అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

2014లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని  ప్రాజెక్టును పూర్తి చేయడానికి పోలవరం అథారిటీ ప్రాజెక్టు అనే కమిటీని వేసుకున్నారు. పనులు ప్రారంభమైన అది పూర్తికాలేదు. ఇంతలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.  ఈయన కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు. చివరికి చంద్రబాబు మళ్ళీ ఈ ప్రాజెక్టుకు దిక్కయ్యారు. 2024లో  మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుకు  ప్రతిసారి బడ్జెట్ ప్రాబ్లం లేదంటే పర్యావరణ అనుమతుల ప్రాబ్లం ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. కానీ ఈసారి కేంద్రం చంద్రబాబుకు మంచి సపోర్ట్ గా ఉంది కాబట్టి 
కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సోమవారం పోలవరం గురించి తప్పకుండా సమీక్ష చేస్తానని అన్నారు. మరి చూడాలి ఈయన హయాంలో ప్రాజెక్టు పూర్తవుతుందా లేదంటే మాటల మూటగానే మారుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: