వైసీపీ : సజ్జల మెడకు రూ.800 కోట్ల స్కాం?

Veldandi Saikiran
ఏపీలో అధికారంలోకి వచ్చిన...తెలుగుదేశం ప్రభుత్వం...ఓ ఆట ఆడుకుంటుంది. వైసిపి పార్టీ నేతల లక్ష్యంగా.. కేసులు పెట్టడం, పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం లాంటివి జరుగుతోంది ఇప్పటికే వైసిపి పార్టీ కార్యాలయాలకు.... నోటీసులు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం... అలాగే వైసిపి కీలక నేతలపై కేసులు కూడా పెడుతోంది. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసింది టిడిపి.
 

వైసిపి ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణ పై.. కేసులు పెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డి పై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్స్ యాజమాని బద్రీనాథ్... ఏకంగా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి  పైన కూడా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో... మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ పేరును కూడా జతపరిచారు.

గత మూడు సంవత్సరాలుగా తమ పొలాలలో...  అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని... ఎన్నిసార్లు చెప్పినా వీళ్లు వినడం లేదని... ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని  మైన్స్ యాజమాని బద్రీనాథ్  ఫిర్యాదు చేయడం జరిగింది. ఏకంగా 500 కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు... కార్డ్స్  ను కొల్లగొట్టారని... ఫిర్యాదులో తెలిపారు. ఈ తతంగం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కను సన్నళ్లలోనే జరిగిందని  తెలిపారు.
 

సైదాపురం మండలం జోగుపల్లి లో  తనకు 240 ఎకరాల పొలం ఉందని... అందులో కేవలం ఎనిమిది గనులకు మాత్రమే  పర్మిషన్ ఉందని బద్రీనాథ్ తెలిపారు. అది కూడా వివాదాంలోనే ఉన్నట్లు తెలిపారు.  కోర్టు దీనిపై స్టే ఇచ్చిందని... అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వినకుండా... వీటిని తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు.  గత రెండు సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్న... తమపై కేసులు పెట్టేందుకు బెదిరిస్తున్నారని వాపోయారు బద్రీనాథ్. దీనిపై సిఐడి పోలీసులు వెంటనే స్పందించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: