మరో బాలీవుడ్ మూవీ కి శ్రీ లీలా గ్రీన్ సిగ్నల్.. ఆమెతోపాటు మరో స్టార్ హీరోయిన్..!?

Anilkumar
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేస్తుంది యంగ్ బ్యూటీ శ్రీ లీల. ఇక ఆ సినిమా తర్వాత నుండి ఈ బ్యూటీకి టాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా ఇప్పటివరకు ఉన్న చాలా మంది యంగ్ హీరోల సినిమాల్లో ఆడి పాడింది. రవితేజ తో నటించిన ధమాకా సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా స్లాపులుగా మారాయి. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమాతో కూడా హిట్

 సాధించలేకపోయింది ఈ అమ్మడు. ఇక దీనికంటే ముందు చేసిన భగవంత్ కేసరి సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి  అప్పటినుండి శ్రీ లీలకి అవకాశాలు రావు అని అనుకుంటున్న సమయంలోనే వరుసగా ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.   త్వరలోనే సైఫ్ అలీ ఖాన్  కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకముందే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో మరొక అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో శ్రీలీల యాక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బేబీ జాన్‌, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి వంటి పలు సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్.. తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో పాటు ఆ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: