అల్లు అయాన్ ను కచ్చితంగా సినిమాల్లోకి తీసుకువస్తా.. మాట ఇచ్చిన అల్లు శిరీష్..!?

Anilkumar
అల్లు కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు  అయితే ఈ యంగ్ హీరో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒకటి కూడా హిట్ కొట్టలేదు. 2022లో ఊర్వశివో రాక్షసివో అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం వడ్డీ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూలై 26 నా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఇందులో ఒక

 టెడ్డీబేర్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మాట్లాడే నడిచే ఒక టెడ్డీబేర్ ప్రపంచంలో జరుగుతున్న పలు అన్యాయాలను గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న  టెడ్డి కోసం అల్లు శిరీష్ ఎంట్రీ ఇస్తాడు. పైలెట్ గా పనిచేస్తున్న అల్లు శిరీష సహాయం కోరుతోంది ఆ టెడ్డి. ఆ తర్వాత ఏం జరుగుతుంది సినిమా ఎలా ముందుకు వెళుతుంది అందులో ఏం జరుగుతుంది అన్న ఒక ఆసక్తికర సంఘటనలను ఇందులో చూపించబోతున్నారు. అయితే నిన్న ఈ సినిమాకి

 సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.  అందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపారు. రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఫాన్స్ కి ఒక ప్రమాణం చేసేసారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అల్లు అయాన్ ని తీసుకువస్తారా అని ఫాన్స్ సరదాగా అడిగితే కచ్చితంగా తీసుకు వస్తాను అంటూ కమిట్మెంట్ ఇచ్చేశారు అల్లు శిరీష్. "అల్లు అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. సోషల్ మీడియా మొత్తం వాడి హవా నడుస్తోంది" అంటూ నవ్వేశారు అల్లు శిరీష్. అయితే అల్లు అర్జున్ ని తీసుకొస్తారా అంటే కుదిరితే చూద్దాం అని సైలెంట్ గా తప్పించుకున్నారు.  అలా అల్లు శిరీష్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: