తెలంగాణ: హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో గల హాస్టల్ వార్డెన్, మాట్రిన్ తదితర పోస్టులకి కూడా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఒక్క సారి ఆ జాబ్స్ వచ్చాయంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఈ నెల 24 నుంచి 29 దాకా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్ సీ) ప్రకటించడం జరిగింది.ఈ మేరకు ఆదివారం నాడు అందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. అందుకు సంబంధించిన హాల్ టికెట్లను కమిషన్ వెబ్ సైట్లో https://www.tspsc.gov.in పరీక్షా తేదీలకు మూడు రోజుల ముందుగా పెడ్తామని వెల్లడించింది. ఈ నెల 24 నుంచి 28 వ తేదీ దాకా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పేపర్-1 జనరల్ స్టడీస్ ఎగ్జామ్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పేపర్---2 ఎడ్యుకేషన్ పరీక్ష అనేది ఉంటుందని ప్రకటించింది. 


ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పేపర్-1జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. ఇంకా అలాగే అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పేపర్-2 ఎడ్యుకేషన్, పేపర్-2 డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెల్ (విజువల్ ఇంపెయిర్ మెంట్, హియరింగ్ ఇంపెయిర్ మెంట్) పరీక్షలు ఉంటాయని పేర్కొన్నది. హాల్ టికెట్ పై ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్ని సూచనలు కూడా ఉన్నాయని, జాగ్రత్తగా పరిశీలించాలని కోరింది.ఇంకా అలాగే అందుకు సంబంధించిన హాల్ టికెట్ పై తాజా ఫొటో అతికించాలని, ఇన్విజిలేటర్ సమక్షంలోనే హాల్ టికెట్ పై సంతకం పెట్టాలని కూడా సూచించింది. అలాగే పరీక్షా కేంద్రానికి ఏదైనా ఒక ఫొటో గుర్తింపు కార్డును తీసుకురావాలని స్పష్టం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా కూడా మొత్తం 581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: