మిస్టర్ బచ్చన్ షోరీల్ రివ్యూ: మాస్ రాజా కల్ట్ బొమ్మ ఇది?

Purushottham Vinay
మిస్టర్ బచ్చన్ షోరీల్ రివ్యూ: మాస్ రాజా కల్ట్ బొమ్మ ఇది?టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'మిస్టర్‌ బచ్చన్‌'. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.ఈ రెండు చిత్రాలకు కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించాయి. షాక్ సినిమా కమర్శియల్ గా పెద్ద హిట్టు కాకపోయినా నటుడిగా రవితేజకి మంచి గుర్తింపుని తీసుకోచ్చింది. ఇక మిరపకాయ్ అయితే అప్పట్లో పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 


ఈ మూవీలో మరాటి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న 'రైడ్' మూవీకి రీమేక్‌గా 'మిస్టర్‌ బచ్చన్‌' తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ విడుదలైంది. అది చూసాకా ఇది మాస్ రాజా కల్ట్ బొమ్మ అనే ఫీల్ వచ్చింది. రవితేజ ఎనర్జిటిక్‌గా ఈ మూవీలో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పైగా ఈ మూవీలో కూడా ఆయన అమితాబ్‌ ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కావడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలను మేకర్స్‌ ప్రారంభించనున్నారు.ఇక మిస్టర్ బచ్చన్ షో రీల్ అదిరిపోవడంతో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్టు కావడం ఖాయం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..ఈ మూవీ విడుదలకు ముందే రవితేజ తన 75వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ మూవీతో రచయిత భాను భోగవరపును దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజకు జోడీగా కనిపించనుంది. షూటింగ్‌ కార్యక్రమాన్ని కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: