పోలవరం ప్రాజెక్టు ఇలా తయారయ్యింది ఏంటి.. చంద్రబాబు ఫైర్..??

Suma Kallamadi
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ ప్రాజెక్టును బాగా సమీక్షించాక మీడియా సమావేశంలో దానికి సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న ఈ పోలవరం ప్రాజెక్టుని చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయని ఎమోషనల్ గా మాట్లాడారు.
2014-19 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న ఏడు తెలంగాణ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపామని గుర్తుచేశారు. తద్వారా ఆ మండలాల ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. అప్పటి ఎన్డీయే-2 కేబినెట్‌ నుంచి ప్రత్యేక ఆర్డినెన్స్ పొంది ఈ పని చేయగలిగామని చెప్పారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా కష్టాలను ఫేస్ చేస్తూ ఉందని, వైఎస్సార్‌ 2005లో ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై చాలానే ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత తమదేనని అన్నారు. డ్యామ్ 45.72 మీటర్ల ఎత్తు ఉండగా 194 టీఎంసీల నీరు స్టోర్ అవుతుందని తాము గమనించినట్లు చెప్పారు. ఆ ఎత్తును తగ్గించడానికి ట్రై చేసినట్లు పేర్కొన్నారు.
స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు వెల్లడించారు, ఒక్క త్రీ గార్జియస్ ప్రాజెక్టు (చైనా) ద్వారా మాత్రమే ఆ లెవెల్‌లో వాటర్ డిశ్ఛార్జి అవుతున్నట్లు వివరించారు. రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని జగన్ లాంటి వాళ్ళు వస్తే ప్రాజెక్టు ఇలా తయారు కాక ఇంకా ఎలా తయారవుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు ఆయన చేసిన అన్యాయం క్షమించరాని నేరం అని, తన కష్టాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే జగన్ కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేసి తప్పు చేశారన్నారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం డ్యామేజ్ అయ్యిందని... రూ.480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని జాగ్రత్తగా చూసుకోలేకపోయారని కూడా విమర్శలు గుప్పించారు. కొంతమేర కాపర్ డ్యామ్‌ నిర్మించకపోవడం వల్ల వరద తాకిడికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. దెబ్బతిన్న దానికి సమాంతరంగా మరోటి నిర్మించాలని అన్నారు. దానికి రూ.447 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం అంతా బిల్డ్ చేయాలంటే రూ.990 కోట్లు వెచ్చించక తప్పదని అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని కూడా తెలిపారు. ప్రాజెక్టుకు జగన్ ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేసారని ఆవేదనగా చంద్రబాబు మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: