విడుదల కాక ముందే రికార్డుల మోత మోగిస్తున్న కల్కి.. ఇండియాలోనే మొదటి సినిమాగా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా విడుదలకే మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు మరో హీరోయిన్గా దిశా పటాన్ని కనిపించబోతోంది. వారితోపాటు భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్స్ అయిన అమితాబచ్చన్ కమలహాసన్ సైతం పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వారితో పాటు మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండ వంటి యంగ్ యాక్టర్స్ సైతం

 ఇందులో పలు పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కానీ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్  లేదు. మరి ఇందులో ఈ యంగ్ యాక్టర్స్ ఉన్నారా లేదా అన్న విషయం తెలియాలి అంటే రేపు ఒక్కరోజు ఆగాల్సిందే. అయితే ఈ సినిమా విడుదల కి మరికొన్ని గంటల సమయం ఉన్నప్పటికీ రికార్డుల మోత స్టార్ట్ చేసింది కల్కి. యూఎస్ లో కల్కి సినిమాకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక కల్కి రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి అని చెప్పాలి.  సాధారణంగా యూఎస్ ఆడియన్స్ క్లాస్,

 హాలీవుడ్ తరహా చిత్రాలు ఎక్కువగా ఇష్టపడతారు. కల్కి మూవీ అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ రేంజ్ చిత్రం. ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు. కల్కి టీమ్ విడుదల చేసిన రెండు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా యూఎస్ లో కల్కి కాసుల వర్షం కురిపిస్తుంది. అక్కడ 500 లొకేషన్స్ లో 3000 షోలకు గాను 1.5 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. మొత్తంగా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $4 మిలియన్ వసూళ్లను అధిగమించింది. ఈ ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ మూవీగా కల్కి రికార్డులకు ఎక్కింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే కల్కి వసూళ్లు భారీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: