వైసీపీలో స‌జ్జ‌ల రాజ‌కీయం ముగిసిన‌ట్టే... జ‌గ‌న్ ఏం చేశారో చూడండి..?

RAMAKRISHNA S.S.
ఏపీ లో గ‌త ఐదేళ్ల లో ముఖ్య‌మంత్రి గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరుకు మాత్ర‌మే ఉన్నారు. అయితే జ‌గ‌న్ అయినా ముఖ్య‌మంత్రిగా ఎంత వ‌ర‌కు అధికారం వెల‌గ పెట్టారో.. ఆ స్థాయిలో అధికారం అనుభ‌వించా రో తెలియ‌దు కాని.. ఆ పార్టీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మాత్రం ఓ రేంజ్‌లో అధికారం ఎంజాయ్ చేశారు. జ‌గ‌న్ తో మాట్లాడాల‌న్నా స‌జ్జ‌ల‌కు చెప్పాలి.. ఎంపీ అయినా .. వైసీపీ ఎమ్మెల్యేలు అయినా.. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు అయినా .. చివ‌ర‌కు మంత్రులు అయినా .. పార్టీలో ఎంత కొమ్ములు తిరిగిన నేత‌లు అయినా ముందు స‌జ్జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల్సిందే.. ఆయ‌న ఓకే అన్నాకే అప్పుడు జ‌గ‌న్ ద‌ర్శ‌నం దొరికితే దొర‌క వ‌చ్చు.. లేక‌పోతే స‌జ్జ‌ల చెప్పింది విని వెన‌క్కు వెళ్లి పోవాల్సిందే.. అంత‌లా స‌జ్జ‌ల హ‌వా చెలాయించారు.

చివ‌ర‌కు జ‌గ‌న్ కూడా మీడియా ముందుకు రారు.. స‌జ్జ‌లే వ‌చ్చేస్తారు.. ప్ర‌భుత్వం .. జ‌గ‌న్ త‌ర‌పున వ‌కల్తా పుచ్చుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం ఐదేళ్ల పాటు స‌జ్జ‌ల‌ను స‌క‌ల శాఖా మంత్రి అని వ్య‌గ్యంగా పిలుచుకున్నారు. అంటే అంద‌రు మంత్రుల శాఖ‌ల్లోనూ స‌జ్జ‌ల కాళ్లు వేళ్లూ పెట్టేస్తూ వ‌చ్చారు. ఏ మంత్రికి స్వేచ్ఛ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ స‌జ్జ‌ల ప్ర‌యార్టీ త‌గ్గిం చేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. స‌జ్జ‌ల త‌న‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చి త‌ప్పుదేవ ప‌ట్టించార‌న్న ఆగ్ర‌హం జ‌గ‌న్ వ్య‌క్తం చేసిన‌ట్టు టాక్ ?

ఇక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత కూడా జ‌గ‌న్ స‌జ్జ‌ల‌కు పూర్తిగా ప్ర‌యార్టీ త‌గ్గించేశార‌ని.. అందుకే బ‌య‌ట ఎక్కువుగా పేర్ని నాని లేదా కొడాలి నాని లాంటి వారే క‌నిపిస్తున్నార‌ని కూడా వైసీపీ వాళ్లే చ‌ర్చించు కుంటున్నారు . మ‌రి జ‌గ‌న్ ప్ర‌యార్టీ త‌గ్గిస్తే స‌జ్జ‌ల రూటు ఎలా మారుతుంద‌న్న ప్ర‌శ్న‌కు కాల‌మే  ఆన్స‌ర్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: