చంద్రబాబు : అప్పటివరకు పోలవరం పూర్తి చేసి చూపెడతా!

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ఇందులో భాగంగానే తాజాగా పోలవరం మహా ప్రాజెక్టును సందర్శించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం మీడియాను అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వరకు అయింది... ఇంకా ఎంత మేరకు పనులు పెండింగ్లో ఉన్నాయి అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
 అంతేకాకుండా... పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను కూడా... తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తాము ముందుగా చేసినట్లుగా...  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం పనులు చేసి ఉంటే...  ఇప్పటికే 2020 ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో.. కంప్లీట్ అయ్యేదని తెలిపారు సీఎం చంద్రబాబు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా చేయకుండా.... కాలయాపన చేసిందని ఫైర్ అయ్యారు.

ఇక తమ ప్రభుత్వంలో అన్ని సవ్యంగా జరిగితే పోలవరం ప్రాజెక్టు మరో నాలుగు సంవత్సరాలలో... పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఏజెన్సీని మార్చడం కారణంగా... పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు వృధా అయ్యాయని... నిప్పులు చెరిగారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటకు తీసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. దీనిలో ఎంతటి వారినైనా అరెస్టు చేస్తామని తెలిపారు.

 7 విలీన మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టే ప్రాజెక్ట్‌ కట్టగలిగామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ అనేక సంక్షోభాలను ఎదర్కొంది... పోలవరం ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గోదావరి జిల్లాలకు నీరు వాడుకోవచ్చు అని  స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. చైనా త్రీగార్జెస్‌ ప్రాజెక్ట్‌ కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే నుంచి విడుదల అవుతుందని.... నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్ట్‌ ఇది అన్నారు. 72 శాతం ప్రాజెక్ట్‌ను మా హయాంలో పూర్తి చేశామని వెల్లడించారు.  అతి త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: