కల్కి లో మహాభారతం వుంది.. కల్కి మ్యూజిక్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ ?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ "కల్కి 2898 AD "..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు... ఈ సినిమా ట్రైలర్ లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు.కల్కి సినిమాలో భారతీయ పురాణాలకు క్లైమాక్స్ వంటిది అని నాగ్ అశ్విన్ తెలిపిన విషయం తెలిసిందే , మహాభారతంకు కలియుగం అంతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ ఈ కథ రాసినట్లు సమాచారం.. ట్రైలర్ లో కూడా మహాభారతంకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించడం జరిగింది.తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు... కల్కి సినిమాలో మహాభారతం పోర్షన్ కూడా ఉంది. దానికి మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ పోర్షన్ కి నేనిచ్చిన మ్యూజిక్ మగధీర – బాహుబలి సినిమాలకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ కు నా నివాళి లాంటిది అని ఆయన అన్నారు. దీంతో కల్కి సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: