అలాంటి పోలీసులు వైసీపీలో చేరిపోండి...అనిత వార్నింగ్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంతమంది పోలీసులకు  ఏపీ కొత్త హోం శాఖ మంత్రి అనిత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి సపోర్ట్ చేయాలనుకునే పోలీస్ అధికారులు వెంటనే రాజీనామా చేసి...  ఆ పార్టీలో చేరమని... చురకలాంటిస్తూ... మండిపడ్డారు హోంమంత్రి అనిత. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... అనితకు హోం మంత్రి పదవి వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆమె హోం మంత్రి పదవిని స్వీకరించి... ఏపీ శాంతి భద్రతల పైన ద్రుష్టి పెట్టారు.

 
 ఇక తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని కొంతమంది పోలీస్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనిత. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేశారని ఆమె విమర్శలు చేశారు. వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తూ ఉందని.. నిప్పులు చెరిగారు. అలాంటివారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసిపి పార్టీలో చేరాలని... ఉచిత సలహా ఇచ్చారు.


 జగన్మోహన్ రెడ్డి పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీలో.. చేరి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనిత. శాంతి భద్రత విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టనని హెచ్చరించారు. సింహాచలం పంచ గ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. వైసిపి పాలనలో... డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయిందని... తమ ప్రభుత్వంలో దాన్ని అరికటిదామని తెలిపారు.


మహిళల పట్ల... అనుచితంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి కూడా మహిళ ఒంటరి గా... ధైర్యంగా తిరిగేలా చేస్తామని తెలిపారు. ఏపీలో ఇకపై రౌడీ రాజ్యం నడవదని...ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు... హోం మంత్రిగా తన పని తాను చేసు కుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: