బిజెపి మాస్టర్ ప్లాన్.. రాజకీయాల్లోకి షమి?

praveen
సాధారణంగా క్రికెట్లో ఎంత దిగ్గజ ఆటగాడు అయినా సరే ఏదో ఒక సమయంలో ఆటకి రిటర్మెంట్ ప్రకటించాల్సిందే. వీడ్కోలు పలకడం ఇష్టం లేకపోయినప్పటికీ అటు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆటకు ఏదో విధంగా దగ్గరగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది కోచ్ లుగా మారిపోతూ ఉంటే.. ఇంకొంతమంది కామెంటేటర్ గా మారిపోయి.. తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను ఉత్కంఠ గా మార్చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం టీమిండియా క్రికెటర్లు వీడ్కోలు తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.

 రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే క్రికెట్ కు ఎక్కడ సంబంధం లేని పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ బిజెపి తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి విజయం కూడా సాధించారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు యువరాజ్ సింగ్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇక ఇప్పుడు మరో టీమిండియా స్టార్ క్రికెటర్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది.

 ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ మేరకు బిజెపి ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే బీజేపీ ఇందుకు సంబంధించిన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టిందట. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లోనే బషీర్ హాట్ నియోజక వర్గం నుంచి బౌలర్ షమీని బరిలోకి దింపాలని కమలదళం భావిస్తుందట  ఇప్పటికే బీజేపీ ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రతిపాదన పై అటు షమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: