ఆశలు పెట్టుకున్న చంద్రబాబు.. పవన్ కూ జగన్ మాస్టర్ ప్లాన్..!!

Divya
ఏ రాజకీయాలలో ఆయన సరే వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేవి కచ్చితంగా ఉంటాయి.. ఇలాంటి ప్రణాళికలు లేకుండా ఎన్నికల సమరం లోకి దిగితే కచ్చితంగా ఓటమి అనేది జరుగుతుంది. ఇది ప్రత్యర్థుల ఊహకు కూడా అందకుండా ఉంటుంది... అలా ఎంతో మంది నేతలు కూడా తమ రాజకీయ చరిత్రలను సైతం తుడిచివేసేలా చేశాయి.. ఇప్పుడు తాజాగా ఏపీలో ఇదే తరహాలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన పెట్టుకున్న ఆశల అన్నీ కూడా గల్లంతయ్యాల వార్తలు వినిపిస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు రోజురోజుకీ వేడి రాజేసుకుంటోంది.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో కూడా హద్దులు దాటుతోంది.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తులకు వ్యూహాలకు టిడిపి జనసేన కూటమిలో కూడా చాలా భయభ్రాంతులు మొదలవుతున్నాయి.. ముఖ్యంగా తాను తీసుకుని నిర్ణయాలకు కట్టుబడి ముందుకు వెళ్లేందు.. వస్తున్న ఎలాంటి చిన్న అవకాశాలను కూడా ఏపీ సీఎం అసలు వదులుకోవడం లేదని తెలుస్తోంది.. అందుకు ఉదాహరణగా కేసినయి నానితోపాటు ఇతర కీలక నేతలు కూడా పార్టీలో చేర్చుకోవడం అలాగే ఇప్పటివరకు ఏ ఓట్ల కోసమైనా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలిశారు వాటి పైన కూడా సీఎం జగన్ ఆశలను సజీవం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది నేతలు ఓటర్లు పవన్ వెంట ఉన్నామంటూ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ చంద్రబాబు ఇప్పటికే ఆశలు పెట్టుకొని మాట్లాడుతున్నారు.. ముఖ్యంగా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాల వల్ల కాపు ఓటర్లు సైతం చాలా అసంతృప్తితో ఉన్నారు.. కాపు ఉద్యమ నేతలుగా పేరుపొందిన హరి రామ జోగయ్య ముద్రగడ వంటి నేతలను పవన్ కళ్యాణ్ వదులుకోవడంతోపాటు ఎవరు సలహాలు ఇవ్వద్దంటూ చాలా పరోక్షంగా వారిని వ్యాఖ్యానించారు.. దీంతో పవన్ కళ్యాణ్ పైన కాపు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. ఏపీ సీఎం వీరిని పార్టీలోకి ఆహ్వానించి.. వీరికి సముచిక స్థానం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా కాపు నేతలు అందరూ వైసీపీలోకి చేరడంతో ఆ ఓట్లు వైసీపీకే పడతాయని పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: