వైసిపికి బ్యాడ్ న్యూస్.. మాజీ మంత్రి రాజీనామా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ గెలుస్తుందని ధీమాతో ఉన్నప్పటికీ అనుకోకుండా భారీ దెబ్బ తగిలింది.కేవలం 11 స్థానాలకే పరిమితమైంది.. కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే టిడిపి పార్టీ కంటే ముందు వరుసలోనే ఉండడం గమనార్హం. ఈ విషయం వైసిపి నేతలను కార్యకర్తలను మాత్రం ఆనందపరిచేలా ఉన్నది.. కూటమిలో భాగంగా 164 సీట్లు సంపాదించుకున్నప్పటికీ టిడిపి ఏడవ స్థానంలో ఉండగా వైసిపి ఐదవ స్థానంలో ఓటింగ్ పరంగా స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న పద్ధతి ఏమిటంటే అధికార పార్టీ ఏది ఉంటే అందులోకి చాలా మంది నేతలు వెళుతూ ఉంటారు.

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ రావడంతో మాజీమంత్రి ఎమ్మెల్యే సిద్ధ రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ మేరకు ఒక లేఖను కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. సిద్ధరామయ్య కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ఈయన 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు  2019 తర్వాత టిడిపి పార్టీకి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు.

ఇప్పుడు 2024లో తిరిగి వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరే ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు బిజెపి పార్టీలోకి జంప్ అయ్యారు. కేవలం తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఎలాంటి కేసులో లేకుండా చేసుకోవడానికి ఇలాంటి పనులు చేయడం జరిగింది. టిడిపి నేతలు. ఏది ఏమైనా వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో కాస్త అసహనం కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎవరెవరు రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారు చూడాలి మరి. మరి వైసీపీ పార్టీని కూడా ఎలాంటి ఇబ్బందులు టిడిపి పార్టీ పెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: