హీరో ఉదయనిధితో ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన నివేదా పెతురాజ్..!!

Divya
ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటుల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు . అలా బాలీవుడ్ లో సినిమా క్రిటిక్ కె ఆర్ కె నిలిచారు.. అయితే ఇప్పుడు తాజాగా కోలీవుడ్లో సావుక్కు శంకర్ అనే జర్నలిస్ట్.. అయినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా రాజకీయ సినీ సెలబ్రిటీల విషయాల పైన నోరు పారేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు యూట్యూబ్లో రాజకీయాల పైన విమర్శలు చేసే శంకర్ తాజాగా హీరోయిన్ నివేదా పెతురాజ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు..

తమిళనాడు  నటుడు డిఎంకె ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పైన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.. ఈ విషయాలు ఇప్పుడు తమిళనాడులో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.. ఈ విషయం పైన నటి నివేదా పేతురాజ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే శంకర్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఉదయనిది స్టాలిన్ పైన ఇలా మాట్లాడుతూ.. ఒక లేడీ హీరోయిన్ కోసం దుబాయ్లో 50 కోట్ల విలువ చేసే ఇల్లు ఉదయనిధీ కొన్నాడని ఆ హీరోయిన్ ఎవరో కాదు నివేదా పెతురాజు అంటూ తెలియజేశారు..

ఇండియాలో కాకుండా దుబాయ్ లో ఎందుకు కొన్నారు అంటే అతడికి కాస్త ప్రవేశి ఎక్కువగా ఉండాలి అక్కడ ఆమెను ఉంచుకున్నాడు అన్న ఉద్దేశంతో దుబాయిలో ఇల్లు కొని అక్కడే ఉంచారంటూ తెలియజేశారు.నెలకు రెండు సార్లు మాత్రమే తమిళనాడుకు వస్తారని ఆమె కోసమే తమిళనాడులో క్రీడా పోటీలను కూడా నిర్వహించారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్ శంకర్.. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

అయితే ఈ విషయం పైన నివేదా పేతురాజ్ కౌంటర్ వేస్తే ట్విట్టర్లో ఒక వివరణ ఇచ్చింది.. తనకోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్నానంటే అమ్మాయి జీవితం నాశనం చేసే ముందు కాస్త నిజాన్ని తెలుసుకొని మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉండబోతారా అని భావించాను.. కానీ ఈ వార్తలతో తాను తన కుటుంబం తీవ్ర బాధకు లోనవుతున్నాము ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి అంటూ తెలిపింది.

తాను చాలా గౌరవ సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాను పదహారేళ్ళ వయసు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతున్నామంటూ తన కుటుంబం ఇప్పటికీ దుబాయిలోనే నివసిస్తోంది 20 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్నాం..సినిమా అవకాశాల కోసం నిర్మాతలను దర్శకులను ఏ హీరోని తాను అడగలేదని ఇప్పటివరకు 20 కి పైగా సినిమాలు చేశాను అవన్నీ తానే సొంతంగా సంపాదించుకున్నానని వెల్లడించింది. దుబాయిలో కూడా తాము 2002 నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాము 2013 నుంచి తనకు రేటింగ్ అంటే ఇష్టమని.. అయితే చెన్నైలో నిర్వహించిన రేసుల గురించి అసలు తనకు ఏమీ తెలియదని వెల్లడించింది. అలాగే తాను సాదాసీదా జీవితాన్ని కూడా గడుపుతున్నాను.. జర్నలిజంలో కాస్తైన మానవత్వం మిగిలి ఉంటుంది.. తన పరువు తీయరనే నమ్మకంతో ఎటువంటి చట్టబద్ధ వారమైన చర్యలు తీసుకోవడం లేదంటూ వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: