1000 కోట్లు.. ఇక కష్టమే పుష్ప?

Purushottham Vinay
పుష్ప సినిమాతో బాక్సాఫీస్ మార్కెట్ వద్ద 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలి అని పుష్ప టీం చాలా బలంగా పని మొదలు పెట్టారు.ఇంత పెద్ద టార్గెట్ అందుకోవాలి అంటే దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్  కూడా ఉండాలి.కానీ వీరి ప్లాన్ చూస్తుంటే అసలు ఆ టార్గెట్ కు తగ్గట్టుగా వెళ్లడం లేదనిపిస్తుంది. ఆగస్టు 15న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడనున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ నిర్ణయానికి సుకుమార్ అండ్ టీం, హీరో అల్లు అర్జున్‌తో సమాలోచనలు జరిపి వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయాలని నిర్మాతలు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.అయితే సుకుమార్ తన టీంతో కలిసి నిర్ణయించుకున్న వాయిదాను మాత్రం మార్చలేకపోయారు. ఆగస్టు 15 వ తేదీను విడుదల తేదీని టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సక్రమంగా పూర్తి చేయడం చాలా కష్టమని భావించి వాయిదా వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ వాయిదా నిర్ణయం నిర్మాతలకు ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది. బిజినెస్ డీల్స్, అడ్వాన్సులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లతో ఖచ్చితంగా అనేక సమస్యలు తలెత్తకుండా ఉండవు. ఈ సినిమా వాయిదా పడ్డ కారణంగా వడ్డీల నష్టం కూడా ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాక, డిజిటల్ హక్కుల ఒప్పందాలను కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రివైజన్ వల్ల కొంత ఆదాయంలో కోత పడే అవకాశం కూడా మెండుగా ఉంది. అందుకే నిర్మాతలు విడుదల విషయంలో అంత సులభంగా నిర్ణయాన్ని మార్చుకోరు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో ఎలా చూసినా పరిస్థితులు అనుకూలించడం లేదు.ఇక అదనపు వర్కింగ్ డేస్ కోసం పెట్టే ఖర్చు, ఫైనాన్స్ వడ్డీలు కూడా బాగా పెరుగుతాయి. ఆగస్టు 15 లాంటి సూపర్ డేట్‌ను కోల్పోవడం వల్ల ఈ సినిమాకి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది. దానికి క్రిస్మస్ లేదా మరో డేట్ చూసుకోవాల్సి వస్తే, అది ఇప్పుడున్నంత అనుకూలంగా మాత్రం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. అలాగే పోటీ కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇలా వాయిదా వెయ్యడం వల్ల సినిమా బజ్ మీద కూడా ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వీళ్ళు 1000 కోట్ల వసూళ్లు రావడం కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: