పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందిగా..?

Suma Kallamadi
2024 ఏపీ ఎన్నికల పోలింగ్ తేదీన ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు ఆయన సంగతి తెలిసిందే. అయితే ఆయన కేసులు నమోదైన సమయం నుంచీ బెయిల్ కోసం సమయాన్ని కష్టపడుతున్నారు. ఇటీవల తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దానిని విచారించిన హైకోర్టు అతనికి భారీ షాక్ ఇచ్చింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఊహించని దెబ్బ తగిలింది. కేసుల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చేతులెత్తేసింది. మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేయగా వాటన్నిటినీ హైకోర్టు కొట్టి వేసింది. దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు లేదా రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి పిన్నెల్లి పారిపోయే అవకాశం ఉంది అందుకే ఇతని కదలికలపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు.
మే 13న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేశారని, టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారని ఆరోపించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌ కోరుతూ పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అరెస్టుకు దూరంగా ఉండేందుకు హైకోర్టు తొలుత అనుమతించి, ఆ తర్వాత ఈ ఉత్తర్వులను పొడిగించింది.
ఈరోజు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.  పిన్నెల్లి స్వేచ్ఛగా ఉంటే సాక్షులను బెదిరించి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో ఆయన అరెస్టును అడ్డుకుంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.  త్వరలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: