బిఆర్ఎస్ : చంద్రబాబు వస్తే బాగుండు.. కేసీఆర్ ఆశలన్నీ టీడీపీపైనే?

praveen
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? విపత్కర పరిస్థితుల్లో మునిగిపోయిన పార్టీని ఎలా బయటపడే బోతున్నారు? ఇప్పటికే పార్టీని వీడిన నేతలు సరే.. ఉన్న నేతలు ఎలా కాపాడుకోబోతున్నారు? అసలు కెసిఆర్ వ్యూహం ఏంటి.?. ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారా? లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ పార్టీని నిలబెట్టుకోసం తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ముందుకు సాగుతారా.? ప్రస్తుతం అందరిలో ఇదే విషయంపై ప్రశ్న నెలకొంది.

 ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అటు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో చివరికి ఆ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఏకంగా కారు పార్టీ సిట్టింగులు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. గులాబీ జెండా పట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఒక్క ఎమ్మెల్యే నైనా కారు పార్టీలో ఉంటారా లేదా అన్న విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కేసిఆర్ ఏం చేయబోతున్నారు అనే విషయం పైనే అందరి దృష్టి ఉంది. ఇలా గులాబీ దళపతి ఏం చేసినా ఏం మాట్లాడినా అది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

 అయితే ప్రస్తుతం పార్టీ విపత్కర పరిస్థితుల్లో మునిగిపోయిన నేపథ్యంలో.. కేసిఆర్ ఇది ఒక మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. లేదంటే పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేయడం అనే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక పొత్తు పెట్టుకోవడానికి బిజెపి కాంగ్రెస్ పార్టీలు కేసిఆర్ తో ఒప్పందం కుదుర్చుకునే ఛాన్సులు లేవు. దీంతో ఇక తనకు గతంలో రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన టిడిపి పైనే.. మళ్లీ కెసిఆర్ ఆశలు పెట్టుకున్నాడు అన్నది తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాలపై కూడా దృష్టి సాధించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఇక  కెసిఆర్ టిడిపి తో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.  ఇలా గతంలో తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవాలని కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారట. మరి ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kvr

సంబంధిత వార్తలు: