ప్రీ సేల్స్ లో దూసుకుపోతున్న కల్కి.. ప్రభాస్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా..?

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ కల్కి 2898 AD”.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు... ఈ సినిమా ట్రైలర్ లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కల్కి టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్స్ రేటు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చాయి. దీనితో కల్కి సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. దీనిని బట్టి కల్కి క్రేజ్ ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం.ఈ సినిమాకు ఏకంగా 1.5 లక్షల టికెట్స్ అమ్ముడై 4 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.ఈ సినిమా కలెక్షన్స్ రికార్డు సృష్టించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: