ఎట్టకేలకు ఆ దర్శకుడికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి.. ఈసారి హిట్ట్ పక్కా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేయగా అప్పుడే షూటింగ్లో జాయిన్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి  . ఇక ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన షూటింగ్ జూలైలో కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్పటినుండి దీనికి సంబంధించిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి  డేట్స్ తక్కువగానే ఉన్నాయి.

 అందుకే ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా కోసం గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా తో పాటు మరికొందరు దర్శకులతో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇకపోతే మోహన్రాజా ప్రస్తుతం ఒరువన్ టు అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది వరకు ఆయన టాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం లేదు. దాంతో అప్పట్లో అనుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసే సినిమా కూడా సెట్ అయినట్లు కనిపించడం లేదు. మిగిలిన స్టార్ డైరెక్టర్ అంతా ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తున్నారు. దాంతో

 ఎప్పటినుండో వినబడుతున్న మెగాస్టార్ చిరంజీవి  హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఇప్పుడు సెట్ అయ్యేలాగా కనిపిస్తుందని అంటున్నారు. విశ్వంభర తర్వాత హరీష్ శంకర్‌ వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరిదశకు రావడం.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో.. మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు హరీష్. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తోంది.  .!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: