కల్కి 2898AD: ఆ స్టార్ హీరో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు సెంటిమెంటా..?
ఇదంతా ఒక ఎత్తు అయితే నాగ్ అస్విన్ .. అశ్వనీ దత్ అల్లుడు కూడ. నాగ్ అశ్విన్ కి ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే అశ్విని దత్తు గారికి కూడా గతంలో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నవి.. ఇప్పుడు ఈ విషయమే ఒక చర్చనీయాంశంగా మారింది. అది విజయ్ దేవరకొండ సెంటిమెంట్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ని ఒక పాత్రగా తీసుకురావడం అన్న అంశం ఇప్పుడు తెరమీదకి వచ్చింది. వాస్తవంగా విజయ్ దేవరకొండ తో చూపించింది కొంతసేపు అయినా తన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చేలా చేశారు నాగ్ అశ్విన్.
విజయ్ దేవరకొండకు సంబంధించి నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ గా మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం హీరో నాని అయితే.. విజయ్ దేవరకొండది ముఖ్యపాత్ర. ఆ సినిమా హిట్ అయింది. అలాగే సెకండ్ మూవీ మహానటి చిత్రంలో కూడా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అందులో కూడా విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు కల్కి చిత్రంలో కూడా చేశారు. కల్కి సినిమా కూడా సూపర్ హిట్ అన్నట్లుగా తెలిసిందే.. సెంటిమెంటు కోసం ఇందులో విజయ్ దేవరకొండను కూడా తీసుకువచ్చారా అనే అంశం వినిపిస్తోంది.