టీ 20 ప్రపంచకప్ ఫైనల్ ఉంటుందా... దక్షిణాఫ్రికా బార్బడోస్‌కు ఎందుకు రాలేదు..?
బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు ఎవరికి ఎవరు తీసిపోయేలా లేవు. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో చిన్న సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా జట్టు ఇంకా బార్బడోస్‌కు చేరుకోలేదు. ఆరు గంటలుగా ట్రినిడాట్ ఎయిర్‌ఫోర్ట్ లోనే దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ కోసం బార్బడోస్‌కు ఎప్పుడు ? వెళుతుంది అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ రేపటికల్లా దక్షిణాఫ్రికా బార్బడోస్‌కు చేరుకోకపోతే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా.. అన్న సరికొత్త ఆందోళన కనిపిస్తోంది. బార్బడోస్ ఆడ విమానాశ్రయంలో ఒక చిన్న ప్రైవేటు విమానం ల్యాండింగ్ ఫెయిల్ అయింది. దీంతో ఆ రన్ వే మొత్తం మూసివేసినట్టు తెలుస్తోంది.
దీంతో అక్కడ ఏ ఫ్లైట్ కూడా దిగేందుకు అవకాశం లేదని.. అలా దక్షిణాఫ్రికా జట్టు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చినట్టు నివేదికలు వస్తున్నాయి. సఫారీ జట్టుతో పాటు వారి కుటుంబ సభ్యులు.. కామెంట్రేటర్లు.. మ్యాచ్ అధికారులు.. ఐసీసీ అధికారులు కూడా ట్రినిడాట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారని సమాచారం. సాధారణంగా టి20 ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహిస్తారు. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. అయితే వెస్టిండీస్ లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో.. శనివారం నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించుకుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల నిర్వహించడం సాధ్యం కాకపోతే అప్పుడు ఆదివారం మ్యాచ్ జరుగుతుంది.