తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలని ఎంతోమంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ హరిప్రియ కూడా ఒకరు.కానీ ఈమె పేరు చాలామంది గుర్తుపట్టకపోవచ్చు.. కానీ హీరో నాని నటించిన పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ అంటే అందరూ గుర్తుపడతారు. ఇందులో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన హరిప్రియ అద్భుతంగా తన నటనతో ఆకట్టుకుంది. వాస్తవానికి హరిప్రియ కన్నడ ఇండస్ట్రీ అమ్మాయి అయినప్పటికీ కూడా పిల్ల జమిందార్ సినిమాలో నటించి మంచి మార్కులే సంపాదించుకుంది.

మొదట తకిట తకిట అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హరిప్రియ తన రెండవ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎంతో మంది చిత్రాలలో నటించిన అతి తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకున్న ఈమె పలు సినిమాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నదట. ఇక హరిప్రియ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2023 లో వశిష్ట అనే నటుడిని వివాహం చేసుకుంది.

ఈయన కూడా కే జి ఎఫ్ చిత్రంలో నటించారు. అలాగే ఓదెల రైల్వే స్టేషన్ తదితర చిత్రాలలో కూడా నటించడం జరిగింది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన వశిష్ట మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఈ జంట ఇప్పుడు త్వరలోనే తల్లిని కాబోతున్నానని ఇప్పుడు 9 నెలల గర్భవతి అంటూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. హరిప్రియ సీమంతం వేడుకలు కూడా తన కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అభిమానుల సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. వశిష్ట ఎక్కువగా విలన్స్ పాత్రలలోనే తెలుగు లో నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: