ఈ సంక్రాంతికి అందంగా తెలిసిపోవాలా.. ఇది రాస్తే చాలు..!

lakhmi saranya
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మగవారైనా, ఆడవారైనా అందం కోసం ఆరాట పడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ కి వెండి ఖర్చు పెట్టడం కంటే ఇంట్లో ఉండే వాటితోనే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇంట్లోనే కాబట్టి ఇవి ఎంతో న్యాచురల్ గా పని చేస్తాయి. సాధారణంగానే మహిళలు అందంగా కనిపించాలని అనుకుంటారు. అందులోనూ పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉన్నాయంటే మరింత అందంగా కనిపించడం కోసం ప్రయాస పడుతూ ఉంటారు.
అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ప్రయాస పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ కి ప్యూ కడుతూ ఉంటారు. అక్కడి వరకు కాకుండా మన ఇంట్లోనే బెస్ట్ బ్యూటీ పార్లర్ లుక్ తెచ్చే పదార్థాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో పచ్చిపాలు కూడా ఒకటి. పచ్చి పాలల్లో కాటన్ బాల్స్ మంచి... ముఖం అంతా పట్టించాలి. ఓ పావు గంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్ని పోయి... కాంతివంతంగా మారుతుంది. ముఖాన్ని గ్లోగా మార్చడంలో తేనే - నిమ్మరసం కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయి.
నిమ్మరసంలో తేనె కలిపి ముఖం అంతా పట్టించండి. ఆరిపోయాక సాధారణ నీటితో కడిగేయండి. జిడ్డుగా ఉంటే లైట్గా సోపు పెట్టవచ్చు. ఈ ప్యాక్ కూడా చక్కగా పనిచేస్తుంది. తరచూ ముఖానికి ఆవిరి పట్టించడం వల్ల కూడా ముఖానికి మంచి గ్లో వస్తుంది. రోజు 10 నిమిషాలు ఆవిరి పడితే... ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. ఆవిరి పట్టించాక మాశ్చరైసర్ చేయాలి. తేనె, పసుపు, నిమ్మరసం, కొబ్బరి నూనె, కొద్దిగా పెరుగు కలిపి...ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖం అంతా అప్లై చేయాలి. ఇలా ఓ అరగంట తర్వాత మొఖం వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేసుకున్నా మంచి గ్లో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: