
రూ.27 కోట్లు పెడితే.. చివరకు సొంత జట్టునే ముంచేశాడు?
పంత్.. IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. గత నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో LSG ఏకంగా రూ. 27 కోట్లు పెట్టి అతన్ని కొనుక్కుంది. పంజాబ్ కింగ్స్.. శ్రేయాస్ అయ్యర్‌పై పెట్టిన రూ.26.75 కోట్ల రికార్డును కూడా LSG బ్రేక్ చేసింది. పంత్‌ను కెప్టెన్‌గా కూడా చేసింది LSG. జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశించింది. కానీ కొత్త జట్టుతో పంత్ ఆరంభం మాత్రం దారుణంగా ఉంది.
LSG 133/2 స్కోరుతో మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు నంబర్ 4లో బ్యాటింగ్‌కు దిగాడు పంత్. ఢిల్లీ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. ముందుగా ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రెండు బంతులు ఆడిన తర్వాత, తన ఇండియన్ టీమ్‌మేట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్కోర్ చేయలేకపోయాడు. మూడు డాట్ బాల్స్ తర్వాత, పంత్ భారీ షాట్ ఆడబోయి మిస్‌టైమ్ చేశాడు. డీప్‌లో ఫాఫ్ డుప్లెసిస్ క్యాచ్ పట్టడంతో.. ఆరు బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
చివరికి LSG ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. చాలా మంది ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ఓటమికి పంత్‌నే నిందించారు. అతని పేలవమైన బ్యాటింగ్, కెప్టెన్సీపై విమర్శలు గుప్పించారు. DCకి కేవలం ఒక్క వికెట్ మాత్రమే మిగిలి ఉన్న కీలక సమయంలో.. పంత్ చేసిన తప్పిదం వల్ల LSG బౌలర్ మోహిత్ శర్మ స్టంపింగ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అయితే, బంతి తన ప్యాడ్లకు తగలడం వల్ల స్టంపింగ్ పూర్తి చేయలేకపోయానని మోహిత్‌ను పంత్ వెనకేసుకొచ్చాడు.
భారీ ధర పెట్టి కొన్నా.. పంత్ పేలవమైన ఆరంభం, LSG స్వల్ప ఓటమి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాయి. ఇంత పెద్ద మొత్తం పెట్టినా అతను ప్రభావం చూపలేకపోయాడు. అతని ఫామ్, నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.