డబుల్ ధమాకా: చరణ్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్ తో పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌ డమ్ దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకుని గ్లోబల్‌ స్టార్‌ అంటూ ట్యాగ్‌ ని సొంతం చేసుకున్నాడు.అలాంటి గ్లోబల్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత చరణ్‌ నుంచి రాబోతున్న తరువాత సినిమా పై సర్వత్రా ఉత్కంఠ ఉండటం చాలా కామన్ విషయం. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రావాల్సిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా శంకర్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా బాగా లేట్ అవుతుంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా గేమ్‌ ఛేంజర్ మూవీ ఉంటుందనే నమ్మకంను మేకర్స్ కలిగిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల తదుపరి సినిమా విషయంలో ఆలస్యం వద్దనే ఉద్దేశ్యంతో ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో తదుపరి సినిమాను మొదలు పెట్టడం జరిగింది.


బుచ్చిబాబు సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ మరోసారి పల్లెటూరి చిట్టిబాబు గా మారబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా మరో ఆసక్తికర విషయం ఏంటంటే బుచ్చిబాబు తన సినిమాలో రామ్ చరణ్‌ ను ఏకంగా రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడట. పైగా అందులో ఒకటి పాజిటివ్‌ కాగా, రెండోది నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గేమ్‌ ఛేంజర్‌ మూవీలో కూడా రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సాధారణంగా చాలా మంది హీరోలు కూడా డబుల్‌ రోల్‌ సినిమాలు చేసేందుకు కొంచెం భయపడుతారు. ఒక వేళ చేయాలి అనుకున్న వారికి నచ్చిన కథ తో రావడం కూడా చాలా కష్టం. అలాంటిది మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో కూడా డబుల్‌ రోల్‌ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ను స్పోర్ట్స్‌ నేపథ్యంలోని కథతో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరాకి సినిమాను విడుదల చేయాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: