ప్రభాస్ " కల్కి " ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పవన్..!

lakhmi saranya
ప్రభాస్ కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు మరో 10 రోజులు ఉండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. కల్కి మూవీ కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కల్కి యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సీఎం అండ్ డిప్యూటీ సీఎం హోదా లో వీరిద్దరూ హాజరుకానున్న తొలి సినిమా వేడుక ఇదేనని చెప్పుకోవచ్చు. కల్కి ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తో చంద్రబాబుకు చక్కటి సన్నిహితం ఉంది. చాలా ఏళ్లగా టిడిపికి మద్దతుగా నిలుస్తున్నారు ఈ ప్రొడ్యూసర్. ఈ ఎన్నికల్లో కూడా టిడిపి పార్టీ 160 కి పైగా సీట్స్ గెలుస్తుందని అశ్వనీదత్ అంచనా వేశారు. ఆయన చెప్పినట్లుగా టిడిపి అండ్ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి వచ్చాయి. ఇక ఈ అభిమానంతోనే చంద్రబాబు కూడా ఈ ఈవెంట్ కి వస్తానని మాట ఇచ్చారట. అలా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే లెవెల్ లో నిర్వహించారు మేకర్స్.
ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికగా పిఠాపురం అండ్ అమరావతి, వైజాగ్ తో పాటు మరికొన్ని సిటీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ తో పాటు వేదిక ఫైనల్ చేసిన తరువాత ఈ ఈవెంట్ పై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ బుధవారం అనగా జూన్ 20న ముంబైలో కల్కి ఈవెన్ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ అండ్ దీపికా పదుకొనే మరియు దిశా పటాన్ని పాల్గొనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: