కన్నప్పను ట్రెండింగ్ గా మార్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !

Seetha Sailaja
ప్రస్తుత తరం ప్రేక్షకులలో మంచు విష్ణు అభిమానులు ఎక్కడో కాని కనిపించరు. అతడి సినిమాలకు సరైన ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రావడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ పై నిర్మిస్తున్న ‘కన్నప్ప’ మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా ఏకంగా మొత్తం యూనిట్ ను న్యూజిలాండ్ తీసుకు వెళ్ళి అక్కడ ఈ ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది.

ఈసినిమాలో ఒక కీలక పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉండటంతో చాలామందికి ఈసినిమా కోసం ప్రభాస్ ను ఎలా ఒప్పించారు అన్న సందేహాలు వస్తున్నాయి. ఈసినిమా టీజర్ లో మంచు విష్ణు కన్నప్ప పాత్ర హైలెట్ అయినప్పటికీ కేవలం ప్రభాస్ కళ్ళు మాత్రమే ఈ టీజర్ లో కనిపించినప్పటికీ ఈ టీజర్ విడుదలైన కొద్ది సేపటికే డార్లింగ్ అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార్చివేశారు.

ఈ టీజ‌ర్ ను హైదరాబాద్ లోని కొన్ని ప్రముఖ ధియేటర్లలో ప్రదర్శిస్తున్న ఈ టీజర్ లో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నపపకీ ఈ టీజర్ లోని ప్రభాస్ కళ్ళు కనిపించగానే ధియేటర్లు చప్పట్లు ఈలలతో హోరెత్తి పోతున్నాయి. మంచు విష్ణు ఈ టీజర్ లో కనిపించినప్పటికీ అభిమానులు మాత్రం మంచి విష్ణు కంటే ఎక్కువగా ప్రభాస్ ను చూశారు.

ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ కావడంతో ఆమూవీలో ప్రభాస్ నటించేది కొన్ని నిముషాలు మాత్రమే అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ మూవీని తమ సినిమాగ భావిస్తూ ఈ మూవీ టీజర్ ను ట్రెండింగ్ గా మర్చివేశారు. ఇప్పటికే ‘కల్కి’ మ్యానియాతో ఉన్న డార్లింగ్ అభిమానులు తమ హీరో కోసమైనా కన్నప్ప మూవీని చూస్తే ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: