బాబు ఫొటో గురించి హేళన చేసిన సీఐ.. దిమ్మ తిరిగే షాకిచ్చిన కోర్టు..??

Suma Kallamadi
పోలీసులు ప్రజలందరికీ ఒకేలాగా న్యాయం చేయడానికి ప్రయత్నించాలి ఒక పార్టీ లేదా ఒక రాజకీయ నాయకుడి వైపు ఉండి పని చేస్తే చివరికి వారు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. తమను తాము ఒక రాజకీయ నాయకుడి కార్యకర్తలారా లేదంటే వారి కోసమే పనిచేసే వారిలాగా మార్చుకోకూడదు. అలా చేస్తే ఎలాంటి పర్యవసానాలను ఫేస్ చేయాల్సి వస్తుందో చెప్పే విధంగా తాజాగా వెలుగు చూసింది.
అసలు ఏం జరిగిందంటే, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు జయరామిరెడ్డి చంద్రబాబు, లోకేష్ ఫోటోలు కలిగిన ఒక బంగారు ఉంగరం తొడుక్కొని తిరిగేవాడు. దీని బరువు 36 గ్రాములు. అయితే అది ఊహించని విధంగా చోరీకి గురైంది. ఈ ఉంగరాన్ని పట్టుకొని తిరిగి తెచ్చి ఇవ్వాల్సిందిగా అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు ఓ రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. అతడిని తిరుపతి తూర్పు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. కానీ సీఐ మహేశ్వరరెడ్డి మాత్రం బాధితుడి కేసు తీసుకోలేదు. పైగా అవహేళనగా మాట్లాడి బాధితుడికి ఇబ్బంది కలిగించాడు. చంద్రబాబు లోకేష్ ఫోటోలు ఉన్న తర్వాత దానిని ఎవరైనా దొంగతనం చేస్తారా అని హేళనగా మాట్లాడాడట. విచారణ పేరిట మూడు రోజులు పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని ఆ తర్వాత అనుమానితుడిని వదిలేసాడట.
దాంతో బాధితుడు స్పందనలో ఒక కేసు వేశాడు. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టులో ప్రైవేట్ గా కేసు ఫైల్ చేశాడు. ఈ కేసును పరిశీలించిన కోర్టు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సీఐని ఏ2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఫిర్యాదు అందిన వెంటనే జనవరిలోనే కేసు ఫైల్ చేసినట్లు తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. కోర్టు ఆదేశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: