హైదరాబాద్: ఆ హోటల్ బిర్యాని తింటే మీ ప్రాణాలు గల్లంతే?

Purushottham Vinay
బిర్యానీ తినాలంటే హైదరాబాద్‌లోనే తినాలని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యాని టేస్ట్ ఎక్కడా రాదు. వరల్డ్ ఫేమస్ బిర్యానీ సిటీగా హైదరాబాద్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే అలాంటి హైదరాబాద్‌లో ఆహార భద్రత మాత్రం కరువయ్యి పర్యాటకులని భయపెడుతుంది.రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హాటల్స్‌పై దాడులు చేశారు. ఆహార భద్రత నియమాలు పాటించని పలు హోటల్స్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ కొన్ని హోటల్స్ తమ పద్దతిని ఏమాత్రం మార్చుకోవడం లేదు.తాజాగా హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్ అయిన మెహఫిల్‌లో తినే బిర్యానీలో పురుగు దర్శనం ఇచ్చింది. ఈ విషయాన్ని కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడి ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది. 


తాజాగా స్విగ్గీ ద్వారా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని మెహఫిల్‌ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బిర్యానీలో చికెన్ ముక్కల్లో పురుగులు ఉన్నట్టు ఆ కస్టమర్ గుర్తించాడు. ఇంకా ఈ విషయాన్ని స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. క్షమాపణ చెప్పి రూ.64 రిఫండ్ చేసినట్లు తెలిపాడు.అయితే తాను ఆర్డర్ చేసిన బిర్యానీకి మాత్రం ఏకంగా రూ.318 ఖర్చైందని.. కానీ కేవలం రూ .64 రూపాయిలు మాత్రమే వారు తిరిగిచ్చారని ఆ కస్టమర్ వెల్లడించాడు.అలాగే మెహ్‌ఫిల్‌ హోటల్ నుంచి ఎవరూ ఆహారం ఆర్డర్ చేయొద్దని నెటీజన్లకు సూచించాడు. అతను స్విగ్గీని ట్యాగ్ చేయడమే కాకుండా రెస్టారెంట్ పై అసంతృప్తితో ఉన్న తేజ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ట్యాగ్ చేశాడు. 'మెహఫిల్ కూకట్ పల్లి నుంచి ఎలాంటి ఆర్డర్స్ చేయవద్దంటూ తన పోస్ట్‌లో రాసుకు రావడంతో పాటు, బిర్యానీలో వచ్చిన పురుగు, స్విగ్గీ టీంతో తాను చేసిన చాట్‌ను కూడా అతను షేర్ చేశాడు.సోషల్ మీడియా పోస్ట్‌ను గమనించిన ఫుడ్ సేఫ్టీ టీం రెస్టారెంట్‌ను చెక్ చేసి, కల్తీ చికెన్ బిర్యానీ ఇంకా లూజ్ పెరుగు నమూనాలను సీజ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: