కోస్తా : ప్రత్తిపాటికి పెద్ద షాక్

Vijaya

టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు ఎన్నికలకు ముందు పెద్ద షాక్ తగిలింది. ఎలాగంటే 66 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినందుకు విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ప్రత్తిపాటి శరత్ ను అరెస్టుచేసిన పోలీసీలు కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండుకు తరలించారు.  కేంద్ర రెవిన్యుశాఖలోని డైరెక్టర్  ఆఫ్ రెవిన్యు ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ జీఎస్టీ తరపున స్టేజ్ జీఎస్టీ ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు.



ఇంతకీ విషయం ఏమిటంటే రాజధాని నిర్మాణ పనుల్లో ప్రత్తిపాటి కొడుకు శరత్ కంపెనీ అవెక్సా సబ్ కాంట్రాక్టులు తీసుకున్నది. అయితే పనులు చేయకుండానే చేసినట్లు, లేనిపనులను చేసినట్లు దొంగబిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నదట. అవే బిల్లులను మళ్ళీ సెంట్రల్ జీఎస్టీకి సబ్మిట్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీకి కూడా తీసుకున్నదట. అంటే రెండురకాల మోసాలకు అవెక్సా పాల్పడినట్లు డీఆర్ఐ, సెంట్రల్ జీఎస్టీ గుర్తించింది. దాంతో విషయాన్ని లోతుల్లోకి తవ్వితే మొత్తం అవినీతి వ్యవహారమంతా బయటపడింది.



వెంటనే సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీకి వివరాలను పంపి మరోసారి క్రాస్ చెక్ చేసుకున్నది. తమదగ్గర ఉన్న సమాచారం అంతా వాస్తవమేనని, అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత విజయవాడ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు ఆధారంగా వెంటనే పోలీసులు శరత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత అంటే శుక్రవారం తెల్లవారిజామున కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల రిమాండుకు పంపింది కోర్టు. ఈ మొత్తాన్ని చంద్రబాబునాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి కుట్రగా నానా గోలచేస్తున్నారు.



అవెక్సా కంపెనీ ద్వారా అవినీతికి పాల్పడింది చంద్రబాబు హయాంలో. దాన్ని గుర్తించి, పట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్ధలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదుచేసింది జగన్ హయాంలో.  ఈ మొత్తంలో జగన్ చేసిన కుట్రేముందో అర్ధంకావటంలేదు. అంటే చంద్రబాబు అండ్ కో ఉద్దేశ్యం ఏమిటంటే అవినీతి పాల్పడి, షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి ఆధారాలతో సహా దొరికిన తర్వాత కూడా కేసు పెట్టకూడదు, అరెస్టు చేయకూడదన్నట్లే ఉంది. మరీ కేసు చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: