టిడిపి జనసేన సీట్ల షేరింగ్ వీడియో లిక్.. చూస్తే నవ్వాపుకోలేరు..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ ఎటువైపుగా వెళుతున్నాయి చెప్పలేని పరిస్థితి మారుతోంది. ఇప్పటివరకు అధికార పార్టీలో ఉన్న వైసిపి ఏడు లిస్టులను సైతం తమ అభ్యర్థులుగా విడుదల చేశారు.. ఇక ప్రతిపక్ష పార్టీలో ఉన్న టిడిపి పార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకొని మరి నిన్నటి రోజున 118 స్థానాల సీట్లను సైతం విడుదల చేశారు.. అయితే ఇందులో కేవలం జనసేన పార్టీకి 24 సీట్లు ఇవ్వడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు సైతం పవన్ కళ్యాణ్ ని మోసం చేసి టిడిపి నేత చంద్రబాబు సీట్లు పంచాడనే విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.

అయితే ఈ విషయం పైన పలువురు వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.. ఒకవేళ సీట్ల పంపక సర్దుబాటు ఎలా జరిగి ఉంటుంది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతూ ఉంటుంది.. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక చిత్రంలోని డబ్బు పంచుకొని వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది ఈ వీడియో లాగానే అటు టిడిపి , జనసేన మధ్య సీట్ల పంపకాలు జరిగే ఉంటాయని విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు..

ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఎలా మోసం చేసి ఎక్కువ సీట్లు తీసుకున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా  కళ్ళకు కట్టినట్టుగా  చూపించారు.. అంతేకాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్లు పంచుకున్న చర్చ లీకంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ వీడియో చూసిన పలువురు రాజకీయ నేతలు ప్రజలు కూడా నవ్వేసుకుంటున్నారు.. మరి ఇంత దారుణంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని మోసం చేశారా అంటూ కూడ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పొత్తు విషయంలో ప్రకటించకుండా ఉండి ఉంటే 175 స్థానాలలో తన సొంత పార్టీ నేతలని నిలబెట్టి తన సత్తా ఏంటో చూపించుకునే వారిని అభిమానులు వాపోతున్నారు.. పొత్తు ప్రకటించడంతో ఇలాంటి దారుణాలను చూడవలసి వస్తోందంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: