మళ్ళీ మోడీ వచ్చాడా.. పిఓకే వచ్చినట్టేనట?

praveen
కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ప్రభుత్వాలు కనీసం అలాంటి నిర్ణయాల గురించి ఆలోచించడానికి భయపడగా.. మోడీ ప్రభుత్వం మాత్రం సాహసాలనే చేసింది. ఇక ఇలాంటి వాటిలో అటు కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ఒకటి అని చెప్పాలి. ఇక 370 ఆర్టికల్ రద్దు ద్వారా ఏకంగా పాకిస్తాన్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసింది మోడీ ప్రభుత్వం. ఇక కేవలం ఈ ఆర్టికల్ ను రద్దు చేయడమే కాదు.. అక్కడ మరుగున పడిపోయిన అభివృద్ధిని గాడిన పెట్టింది. ఏకంగా మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా ముందుకు సాగింది.

 కనీసం సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందుబాటులో లేని గ్రామాలకు సైతం సెల్ఫోన్ టవర్లను విస్తరించి ఇంటర్నెట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు సైతం మంత్రముగ్దులు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక భారత్ దేశంలో భాగం కావాలని ఆశ పడుతున్నారు. అయితే ఇప్పుడు మోడీ టార్గెట్ పిఓకే నే అన్నది తెలుస్తోంది. ప్రపంచ చరిత్రగతిలో కీలకమైన అటువంటి మార్పులకు తమ ప్రభుత్వం కారణం కాబోతుందని ఇటీవల నరేంద్ర మోడీ ప్రసంగంలో తెలిపారు.

 అయితే ఈ ప్రసంగంలో ఉన్న సరైన అర్థమేంటి అన్న విషయాన్ని మాజీ రా అధికారి ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అటు భారత్ లో భాగం చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసిందట. పార్లమెంటు ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఈ ప్రణాళికలను ఆచరణలో పెట్టబోతుండట. అంతేకాదు ఇక ఉగ్రవాదాన్ని కూడా రూపుమాపేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు కూడా చేపట్టపోతుందట మోడీ ప్రభుత్వం. ఇప్పటికే కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత చేస్తున్న అభివృద్ధి చూసి ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజల సైతం అక్కడే ప్రభుత్వంపై తిరగబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఇలా పిఓకే ప్రజలే భారత్ లో కలవాలని ఆకాంక్షించేలా మోడీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: