శ్రీలంకను అడ్డుపెట్టి.. చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోడీ?

praveen
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది చైనా. ఈ క్రమంలోనే తమ దగ్గర ఉన్న ఆర్థిక వనరులతో ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని.. ఎప్పుడు నీచమైన ఆలోచన చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ లాంటి దేశానికి అవసరానికి మించి అప్పులు ఇచ్చి ఇక అప్పులు తీర్చలేని సమయంలో తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటలు ఆడిస్తూ ఉంటుంది. చైనా చెప్పినట్లుగానే పాకిస్తాన్ ఎప్పుడు భారత్ పై దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే శ్రీలంక విషయంలో కూడా అటు చెైనా ఇలాంటి వ్యూహాన్ని పన్నింది. శ్రీలంక  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో అప్పు ఇస్తున్నాము అంటు నాటకం ఆడిన చైనా చివరికి ఆ దేశాన్ని తమ కనుసన్నల్లో  పెట్టుకోవాలని భావించింది. కానీ ఇక మొదటి నుంచి చైనాకు అండగా నిలబడుతున్న భారత్.. ఇక చైనా ఆటలు సాగనివ్వలేదు. ఏకంగా చైనా ఇచ్చిన అప్పు కారణంగా శ్రీలంకలోని హంబతోట పోర్ట్ చైనాకు రాసిచ్చింది శ్రీలంక. అయితే ఈ పోర్టుని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా భారత్ పై నిఘా పెట్టాలని అనుకుంది చైనా.

ఈ క్రమంలోనే చైనా సైనిక నౌకలను హంబతోట పోర్టుకి తీసుకువచ్చింది చైనా. ఇలాంటి సమయంలోనే ఏకంగా చైనా నౌకలపై అటు శ్రీలంక నిషేధం విధించింది అని చెప్పాలి. దీంతో చైనాకు ఊహించని షాక్ తగిలింది. ఇక ఇలా ఒకప్పుడు చైనా నౌకలను హంబ తోట పోర్టులోకి రానివ్వకుండా నిషేధం విధించిన శ్రీలంక.. ఇక ఇప్పుడు భారత యుద్ధ నౌకకి మాత్రం ఘన స్వాగతం పలికింది. సముద్రపు దొంగలు నుంచి రక్షించేందుకు నిఘా కాస్తున్న భారత సబ్ మేరైన్ ఇటీవల హంబతోట పోర్టుకు వెళ్లగా.. ఘన స్వాగతం పలికింది శ్రీలంక. ఇలా ఏకంగా చైనా నౌకపై నిషేధం విధించి.. భారత నౌకకు స్వాగతం పలకడం ద్వారా తాము భారత్ వైపే ఉన్నాము అని శ్రీలంక చెప్పకనే చెప్పింది. ఇలా వ్యూహాత్మకంగా  మోడీ ప్రభుత్వం చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: